గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

Published Wed, Jan 17 2024 11:08 AM

Governor Tamilisai Twitter Account Hacked - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు ఇటీవల వరుసగా హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ఈ అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు.

గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీటర్‌ అకౌంట్లు కూడా హ్యాక్‌ అయిన సంగతి తెలిసిందే. మొన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. తాజాగా గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌(ఎక్స్‌) అకౌంట్‌ హ్యాక్‌ చేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు రాజ్‌భవన్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement