బీఆర్‌ఎస్ పక్షాన పోరాటం: హరీశ్‌రావు
నంగునూరు (సిద్దిపేట): ‘వానాకాలం ప్రారంభమై నా ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందించడం లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తోంది. పంటకు బోనస్ అన్న మాటను బోగస్‌గా మార్చారు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి లో రైతు నాగేంద్ర పొలంలో ఆయిల్‌పామ్ మొదటి పంటను కోసి క్రాప్ కటింగ్‌ను ప్రారంభించారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ విత్తనాల కోసం రైతులు ఆందోళన చేసినా పట్టించుకోవడంలేదని, ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వరి పంట బోనస్ విషయంలో మంత్రులు తలో మాట మాట్లాడుతు న్నారని విమర్శించారు. పంట పెట్టుబడితోపాటు రైతు సమస్యలపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఆయిల్‌పామ్ దిగుబడిపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తొలగించడంతో దిగుమతులు పెరిగి విదేశీ మారకం నష్టపోతున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్‌పామ్ పంట సాగును ప్రోత్సహించడంతో ఖమ్మం తరువాత స్థానంలో నిలిచి ఆదర్శంగా నిలిచిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment