వైఎస్సార్‌ సీపీలో చేరికలు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో చేరికలు

Published Thu, May 9 2024 3:55 AM

వైఎస్సార్‌  సీపీలో చేరికలు

యలమంచిలి : సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే ఈ ఎన్నికలలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల గెలుపునకు దోహదం చేస్తాయని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు గుణ్ణం నాగబాబు అన్నారు. లక్ష్మీపాలెంలో బుధవారం టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు నాగబాబు సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరందరికీ నాగబాబు వైఎస్సార్‌ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన నచ్చడం వలనే టీడీపీ, జనసేన నాయకులు వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారంతా పాలకొల్లు ఎమ్మెల్యేగా గుడాల శ్రీహరి గోపాలరావు, నరసాపురం ఎంపీగా గూడూరి ఉమాబాల విజయానికి కృషి చేయాలని కోరారు. సర్పంచ్‌ గటిగంటి మహేష్‌, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లాడి ఏడుకొండలు పార్టీ నాయకులు పెసంగి సుబ్రహ్మణ్యం, మోకా ప్రేమ్‌చంద్‌, లంకే సూర్యచంద్ర, పెసంగి ఏసు, పొన్నమండ నరసింహస్వామి, ఉండవల్లి చక్రవర్తి, జల్లి నరసింహమూర్తి, కందికట్ల చిట్టిబాబు, పొన్నమండ వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో మోకా రవితేజ, పొన్నమండ ముత్యాలు, కర్రి ఆంజనేయులు, మల్లాడి గంగరాజు, కర్రి పెద్దిరాజు, కర్రి శ్రీనివాస్‌, కర్రి ప్రేమ్‌కుమార్‌, పెసంగి దుర్గాప్రసాద్‌, కర్రి కృష్ణ, కర్రి సాయిబాబు, అంగాడి దుర్గా ప్రసాద్‌, మల్లాడి రవితేజ, వనమాడి సుబ్రహ్మణ్యం, పొన్నమండ వీరాస్వామి, బస్వాని విజయ్‌, బెజవాడ రామారావు తదితరులు ఉన్నారు.

గుడాల గోపి సమక్షంలో 70 మంది చేరిక

పాలకొల్లు అర్బన్‌: పేదల పక్షాన పనిచేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) కోరారు. పాలకొల్లు వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో బుధవారం పట్టణంలోని 18వ వార్డు రాజీవ్‌నగర్‌కి చెందిన 70 మంది యువజనులు గుడాల గోపి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. గుడాల గోపి వీరికి పార్టీ కండువాలు మెడలో వేసి స్వాగతం పలికారు. మే 13న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతీ కార్యకర్త బూత్‌లను పర్యవేక్షించి ప్రతీ ఒక్కరి చేత ఓటు వేయించాలని కోరారు. పాలకొల్లులో ఈ సారి వైఎస్సార్‌ సీపీ విజయఢంకా మోగించడానికి యువత నడుంకట్టాలన్నారు. పాలకొల్లును అభివృద్ధిపథంలో నడిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ మాజీచైర్మన్‌ యడ్ల తాతాజీ, జేసీఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఖండవల్లి వాసు, వార్డు ఇన్‌చార్జ్‌ రామాంజుల పెదమధు, పసుపులేటి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement