ఏపీ మంత్రి ఓవరాక్షన్!
వైఎస్‌ఆర్ జిల్లా: జెడ్పీ సమావేశంలో మంత్రి ఆదినారాయణరెడ్డి ఓవరాక్షన్ చేశారు. జెడ్పీ సమావేశంలో భాగంగా ఆర్డీవో వినాయక్‌పై కలెక్టర్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
అయితే, ఫిర్యాదు ఇప్పుడు కాదు తర్వాత చేయలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి హుకుం జారీచేశారు. మంత్రి తీరును ఎమ్మెల్యే రాచమల్లు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో ఎమ్మెల్యే రాచమల్లు, మంత్రి ఆదినారాయణరెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.