గుంటూరు జిల్లా గురజాలలోని రాములవారి ఆలయంలో దొంగలు పడి అతి పురాతన ఉత్సవ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. రామాలయంలోని పంచలోహ నిర్మిత శ్రీరాముడు, సీత, లక్షణస్వామి వారి విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో ఉన్న రామాలయంలో సోమవారం ఉదయం పూజలు నిర్వహించడానికి వెళ్లిన భక్తులు ఈ విషయాన్ని గమనించి పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎత్తుకెళ్లిన విగ్రహాల విలువ సుమారు రూ. 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంటున్నారు.
గురజాల రామాలయంలో చోరీ
Published Mon, Apr 4 2016 1:21 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement