కిడ్నీ బాధితులతో వైఎస్ జగన్ ముఖాముఖీ
ఉద్దానం: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...ఉద్దానం కిడ్నీ బాధితులతో ముఖాముఖీ అయ్యారు. ఆయన శనివారం జగతి గ్రామంలో కిడ్నీ బాధితులను కలిసి, వారి సమస్యలను, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడును వైఎస్ జగన్ ఎదుట వెళ్లబోసుకున్నారు. డయాలసిస్ చేయించుకునేందుకు నెలకు ఒక్కొక్కరికి రూ.15 వేలు నుంచి రూ.20వేలు అవుతోందన్నారు.
అంత ఆర్థిక స్తోమత తమకు లేదని, చావే దిక్కని వారు వాపోయారు. ప్రభుత్వం కూడా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా మర్చిపోయారని తెలిపారు. విశాఖ వెళ్లి వైద్యం చేయించుకోలేకపోతున్నామని వెల్లడించారు. బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.