యాక్సెంచర్లో 95వేల కొత్త ఉద్యోగాలు
న్యూయార్క్ : ఈ ఏడాది ఆగస్టుతో ముగిసే ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా మొత్తం 95,000 నియామకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్ సంస్థ యాక్సెంచర్ తెలిపింది. కంపెనీ సెప్టెంబర్-ఆగస్టు కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. మే 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో యాక్సెంచర్ 7.8 బిలియన్ డాలర్ల ఆదాయన్ని ఆర్జించగా, నాలుగో త్రైమాసికంలో 7.45-7.70 బిలియన్ డాలర్ల స్థాయిలో ఆదాయాలు ఉండొచ్చని అంచనా వేస్తోంది.
మూడో త్రైమాసికం ఆఖరు నాటికి 3,36,000 పై చిలుకు ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు మూడు లక్షల మంది భారత్తోనే ఉన్నారు. మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీలో అత్యధికంగా 3,19,656 మంది, ఇన్ఫోసిస్లో1.76 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.