ఫేర్వెల్ పార్టీ ఉందని చెప్పినా... | Mystery shrouds engg student's suicide in nakrekal | Sakshi
Sakshi News home page

ఫేర్వెల్ పార్టీ ఉందని చెప్పినా...

Published Wed, Jun 1 2016 11:55 AM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM

ఝాన్సీ(ఫైల్) - Sakshi

ఝాన్సీ(ఫైల్)

నల్లగొండ: బీటెక్ విద్యార్థిని ఝాన్సీ ఆత్మహత్యపై మిస్టరీ వీడింది.  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఝాన్సి హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. బీటెక్ పరీక్షలు ముగించుకొని ఇంటికి వచ్చిన ఝాన్సికి బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేసినట్లు ఆమె భర్త విజేందర్ రెడ్డి, తల్లి పద్మలే అని పోలీసుల విచారణలో తేలింది. దీంతో మూడు రోజులుగా అనేక మలుపులు తిరిగిన మర్డ్‌ర్ మిస్టరీ వీడినట్లైంది.

ప్రస్తుతం ఝాన్సీ స్నేహితుడిని పోలీసులు విచరాణ చేపట్టారు. తల్లి, భర్త వేధింపుల కారణంగానే ఆమె మృతి చెందిందని ఆమె స్నేహితుడు సాయిరాం తెలిపారు. ఝాన్సీ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెప్పాడు. గతంలోనూ ఆమెను తల్లి, భర్త వేధించారని.. ఆ విషయం తమతో చెప్పిందని వెల్లడించాడు. ఫేర్వెల్ పార్టీ ఉందని చెప్పినా కూడా వినకుండా బలవంతంగా హైదరాబాద్ నుంచి ఝాన్సీని తీసుకెళ్లారని, అదేరోజు ఆమె ఆత్మహత్య చేసుకుందని స్నేహితులకు సమాచారం ఇచ్చారని తెలిపాడు.

ఝాన్సీ ఆత్మహత్య కేసులో విచారణ కొనసాగుతోందని నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆమెను కుటుంబ సభ్యులు వేధించినట్టు ఆరోపణలు వచ్చాయన్నారు. ఆత్మహత్య చేసుకుందని చెబుతూనే గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేశారని తెలిపారు. ఫేర్వెల్ పార్టీ ఉందని స్నేహితులు చెప్పినా వినకుండా ఝాన్సీని నకిరేకల్ తీసుకొచ్చారని, అదే రోజు ఆమె చనిపోయిందని చెప్పారు.

అయితే.. ఝాన్సీని ఇంటికి తీసుకొచ్చి చిత్ర హింసలు పెట్టి పురుగుల మందు తాగించి హత్య చేశారనీ.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించి నల్లగొండ మండలం దీపకుంటలో దహన సంస్కారాలు చేశామని నిందితులు పోలీసుల విచారణలో తెలపడంతో.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

వ్యభిచారం చేయమని తల్లి, భర్త ఒత్తిడి, సూసైడ్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement