'ఆయన నుంచి నేర్చుకోవాల్సిన గతి పట్టలేదు' | harish rao fire on Digvijaya Singh on corruption allegations | Sakshi
Sakshi News home page

'ఆయన నుంచి నేర్చుకోవాల్సిన గతి పట్టలేదు'

Published Sat, Jul 9 2016 4:34 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

'ఆయన నుంచి నేర్చుకోవాల్సిన గతి పట్టలేదు' - Sakshi

'ఆయన నుంచి నేర్చుకోవాల్సిన గతి పట్టలేదు'

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన గతి మాకు పట్టలేదని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు దిగ్విజయ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని, అలాంటి వ్యక్తికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదని చెప్పారు. గతంలో టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకున్నప్పుడు దిగ్విజయ్ ఏం చేశారని ఈ సందర్భంగా హరీష్ ప్రశ్నించారు. తెలంగాణలో అభివృద్ధిని ఏదో రకంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ మంత్రి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement