మంచు కాంపౌండ్ లోకి క్రేజీ యాంకర్..!
బుల్లితెరపై తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ అనసూయ. జబర్థస్త్ షోతో ఒక్కసారిగా స్టార్ లీగ్ లోకి చేరిపోయిన ఈ భామ తరువాత వెండితెర మీద కూడా సత్తా చాటింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగ్ సరసన చిందులేసి ఆకట్టుకోగా, క్షణం సినిమాతో నెగెటివ్ రోల్ లోనూ మెప్పించింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985లో నటిస్తోంది.
అదే జోరులో ఇప్పుడు మరో క్రేజీ సినిమాకు సైన్ చేసింది. సీనియర్ హీరో మోహన్ బాబు లీడ్ రోల్ లో మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించనుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మోహన్ బాబు తో పాటు యంగ్ హీరో విష్ణు కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.