ఇదీ.. మన బుల్లెట్‌ | This is our Bullet train | Sakshi
Sakshi News home page

ఇదీ.. మన బుల్లెట్‌

Published Wed, Sep 13 2017 1:15 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

ఇదీ.. మన బుల్లెట్‌ - Sakshi

ఇదీ.. మన బుల్లెట్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబేలు సబర్మతిలో ముంబై– అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
508 కిలోమీటర్లలో 468 కి.మీ (92 శాతం) 20 మీటర్ల ఎత్తులో ఉండే ఎలివేటెడ్‌ మార్గం. అంటే మన మెట్రోలాగా స్తంభాలపై వెళుతుంది. 27 కిలోమీటర్లు భూగర్భ టన్నెల్‌. ఇందులో ఏడు కిలోమీటర్లు సముద్రగర్భంలో ఉంటుంది. బాంద్రా–కుర్లా వద్ద టన్నెల్‌ ప్రారంభమై థానే వద్ద ముగుస్తుంది. 13 కిలోమీటర్ల మార్గం భూమి మీద ఉంటుంది.
ముంబై– అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్‌ రైలు ప్రయాణించే దూరం : 508 కిలోమీటర్లు
ముంబై, థానే, విరార్, బోయ్‌సర్, వాపి, బిలిమొర, సూరత్, బరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్,  సబర్మతి 12 స్టేషన్లు
గంటకు బుల్లెట్‌ రైలు వేగం.గరిష్టంగా 350 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 320
 
ప్రయాణ సమయం
సూరత్, వడోదర స్టేషన్లలో మాత్రమే ఆగితే 2 గంటల 7 నిమిషాల్లో గమ్యం చేరుకుంటుంది. అన్ని స్టేషన్లలోనూ ఆగితే 2 గంటల 58 నిమిషాల్లో గమ్యం చేరుతుంది. ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతోంది.  

165 సెకన్లు
ఒక్కో స్టేషనులో ఈ రైలు రెండు నిమిషాల నలభై ఐదు సెకన్లు మాత్రమే ఆగుతుంది.
ప్రాజెక్టు మొత్తం వ్యయం రూపాయలు కోట్లలో.. 1,10,000
 
► 88,000 కోట్లు ఈ  ప్రాజెక్టుకు జపాన్‌ ఇస్తున్న రుణం. 50 ఏళ్లలో తిరిగి చెల్లించాలి. 15 ఏళ్ల మారటోరియం వెసులుబాటు కూడా ఉంది. నామమాత్రపు వడ్డీ 0.1 శాతమే. జపాన్‌ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ (జికా) ఈ రుణాన్ని ఇస్తోంది.
► డిసెంబరు 2023 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలి. అయితే భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగష్టు 15, 2022 నాటికే ప్రాజెక్టు పూర్తవ్వాలని మోదీ ఆశిస్తున్నారు. 
 
అవసరమయ్యే భూమి(ఎకరాల్లో) 2,039
జపాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న బుల్లెట్‌ రైళ్లు 24
ముంబై– అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైళ్లు రోజుకు వేయనున్న ట్రిప్పులు (అప్‌ అండ్‌ డౌన్‌) 35
బుల్లెట్‌ రైలు ప్రయాణికుల సామర్థ్యం 750
 
జపాన్‌ టెక్నాలజీ.. 
షిన్‌కాన్సెన్‌ హైస్పీడ్‌ రైల్‌ టెక్నాలజీని జపాన్‌ భారత్‌కు బదలాయిస్తుంది. ఫలితంగా భవిష్యత్తులో మన అవసరాలకు తగ్గట్లుగా మనమే ఉత్పత్తి చేసుకోవచ్చు.
బుల్లెట్‌ రైలు వ్యవస్థను నడపడానికి అవసరమయ్యే ఉద్యోగుల సంఖ్య: 4,000
నిర్మాణ సమయంలో 20 వేల కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. 
మరో 20 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది.
 
టికెట్‌ ధర
ప్రస్తుత ఏసీ టికెట్‌ ధర కంటే 1.5 శాతం ఎక్కువగా ఉంటుంది. రూ. 3,000 నుంచి 5,000 మధ్య ఉండొచ్చు. విమానధరలు కూడా 5,000 దాకా ఉన్నాయి. ముందుగా బుక్‌ చేస్తే తక్కువ ధరలకు వస్తాయి. విమాన ప్రయాణం సమయం 70 నిమిషాలే. అయితే విమానాశ్రయానికి రాకపోకలకు, చెక్‌ ఇన్, దిగాక లగేజీ కోసం వెయిట్‌ చేయడం... తదితర కారణాల వల్ల చాలా సమయం వృథా అవుతోంది. బుల్లెట్‌ రైలు ప్రయాణం చాలా సురక్షితం. 1964లో జపాన్‌ బుల్లెట్‌ రైలు వ్యవస్థను ప్రారంభించాక ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ పెద్ద ప్రమాదం ఒక్కటి కూడా జరగలేదు. ఏ ఒక్క ప్రయాణికుడు మృతి చెందలేదు. ఠంచనుగా సమయానికి వచ్చేస్తాయి. ఆలస్యం ఉండదు.
 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement