-
కెవిన్ ఒబ్రెయిన్ సెంచరీ .. గుజరాత్ జెయింట్స్ ఘన విజయం
ఐర్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ ఒబ్రెయిన్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో శతకంతో మెరిశాడు. అతని విధ్వంసం ధాటికి గుజరాత్ జెయింట్స్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆష్లే నర్స్ 43 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 103 పరుగులు నాటౌట్ విధ్వంసం సృష్టించగా.. దినేశ్ రామ్‌దిన్ 31 పరుగులు చేశాడు. వీరిద్దరి మినహా మిగతావారెవరు పెద్దగా రాణించింది లేదు. గుజరాత్ జెయింట్స్ బౌలింగ్‌లో తిసారా పెరీరా, ఎమ్రిత్, అప్పన్న తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 18.4 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. కెవిన్ ఓబ్రెయిన్ 61 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగుల చేయగా.. పార్థివ్ పటేల్ 24, యష్పాల్ సింగ్ 21 పరుగులు చేశారు. ఇండియా క్యాపిటల్స్ బౌలింగ్‌లో ప్రవీణ్ తాంబే 3, లియామ్ ప్లంకెట్ 2, ఆష్లే నర్స్, మిచెల్ జాన్సన్లే తలా ఒక వికెట్ తీశారు. -
చూశారా.. ఇదే మా సమాధానం: వెస్టిండీస్ క్రికెటర్
పుణె: భారత్‌పై మూడో వన్డేలో విజయం సాధించిన తర్వాత వెస్టిండీస్ ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. తొలి వన్డేలో పోరాడి ఓడిన విండీస్.. రెండో వన్డేను టైగా ముగించింది. కాగా, మూడో వన్డేలో ఏకంగా విజయమే సాధించి టీమిండియాకు షాకిచ్చింది. దాంతో విండీస్ ఆటగాళ్లు తమ మాటలకు పదునుపెట్టారు. గత మ్యాచ్‌లలా కాదంటూ.. ఇప్పుడు రెండు వన్డేలలోనూ గెలిచితీరతామనే విధంగా చెప్పుకొస్తున్నారు. భారత్ గడ్డపై వెస్టిండీస్ ప్రదర్శన గురించి అనుమానం వ్యక్తం చేసి తమను విమర్శించిన వారికి ఇటీవల ముగిసిన మూడు వన్డేల్లో మా జట్టు కనబర్చిన ప్రదర్శనే సమాధానమని ఆ జట్టు ఆల్‌రౌండర్ నర్స్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లో విజయం తర్వాత పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ..‘ చూశారా.. ఇదే మా సమాధానం. మా జట్టును విమర్శించిన వారు ఇప్పుడేమంటారు. మూడో వన్డేలో మా జట్టు ఆడిన తీరు అమోఘం. మేము ఇక్కడకు వచ్చినప్పుడు అండర్‌డాగ్స్‌గానే వచ్చాం. అది కూడా కచ్చితమైన ఆటతో అలరించాలనుకున్నాం. అయితే భారత్‌పై టెస్టు సిరీస్‌ను కోల్పోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మా సత్తా ఏమిటో బయటపడింది కదా’ అంటూ నర్స్ వ్యాఖ్యానించాడు. పుణె వేదికగా శనివారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో బ్యాట్‌తో 22 బంతుల్లోనే 4ఫోర్లు, 2సిక్సుల సాయంతో 40 పరుగులు చేసిన నర్స్.. బంతితోనూ శిఖర్ ధావన్ (35), రిషబ్ పంత్ (24) వికెట్లను పడగొట్టాడు. దీంతో.. భారత్‌పై 43 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు గెలుపొందగా.. కీలక ప్రదర్శన చేసిన నర్స్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. పుణేలో పల్టీ ఈ ఘనతా.. అతడికే సొంతం
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్‌కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్‌గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement