group
-
వన ఉత్పత్తులకు.. దమ్మక్క బ్రాండ్!
అడవుల జిల్లాగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలుగా గిరిజన మహిళలు ఎదుగుతున్నారు. ఐదేళ్ల కిందట శిక్షణతో మొదలైన వారి ప్రయాణం నేడు ఈ కామర్స్ వాకిలి వరకు చేరుకుంది. వీరి విజయ గాథ...నైపుణ్య శిక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహిళలు 2018లో హైదరాబాద్‌కు ఐటీడీఏ తరఫున వెళ్లారు. అక్కడ సబ్బులు, షాంపులు తయారు చేసే ఓ సంస్థలో మూడు నెలలు శిక్షణ తీసుకున్నారు. ఆ శిక్షణతోనే సరిపెట్టుకోకుండా అదే కంపెనీ లో మరో తొమ్మిది నెలల పాటు పనిచేసి తమ నైపుణ్యానికి మరిన్ని మెరుగులు అద్దుకున్నారు. ఇందులో పదిహేను మంది సభ్యులు కలిసి దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూప్‌గా ఏర్పడ్డారు. రూ. 25 లక్షలతో షాంపూ, సబ్బుల తయారీ పరిశ్రమ స్థాపించాలని నిర్ణయించుకున్నారు.అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ..దమ్మక్క గ్రూప్ సభ్యుల ఉత్సాహం చూసి అప్పటి ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు బ్యాంకు అధికారులతో మాట్లాడి లోను ఇప్పించడంతో భద్రాచలంలో 2019 నవంబరులో షాంపూ తయారీ యూనిట్నుప్రారంభించారు. పనిలో చేయి తిరగడం అలవాటైన కొద్ది రోజులకే 2020 మార్చిలో కరోనా విపత్తు వచ్చి పడింది. లాక్డౌన్ లు, కరోనా భయాల వల్ల బయటకు వెళ్లి పని చేసేందుకు ఇంట్లో కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడం ఒక ఇబ్బందైతే, మరోవైపు తయారీ యూనిట్లో షాంపూ బాటిళ్లు పేరుకుపోయాయి. ఇంతలోనే ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు షాంపూ బాటిళ్లు కావాలంటూ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి ఆర్డర్ రావడంతో కొంత ఊతం లభించింది.’’ అంటూ దమ్మక్క గ్రూపు జాయింట్ సెక్రటరీ బేబీరాణి అనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.ఊపందుకున్న అమ్మకాలు..షాంపూ కొనుగోలుకు జీసీసీ నుంచి మార్కెట్ అందుబాటులో ఉండటంతో పాటు షాంపూ నాణ్యత విద్యార్థులకు నచ్చడంతో క్రమంగా దమ్మక్క యూనిట్ పనితీరు గాడిలో పడింది. 100 మిల్లీలీటర్ల షాంపూ బాటిళ్ల తయారీ 2021లో యాభైవేలు ఉండగా 2022 ముగిసే నాటికి లక్షకు చేరుకుంది. ఆ మరుసటి ఏడాది ఏకంగా రెండు లక్షల బాటిళ్ల షాంపూలు తయారు చేసి విక్రయించారు. షాంపూల తయారీలో వచ్చిన అనుభవంతో ఈ ఏడాది మొదట్లో గ్లిసరిన్ ప్రీమియం సబ్బుల తయారీనిప్రారంభించి జీసీసీ స్టోర్లలో ప్రయోగాత్మకంగా అమ్మకాలుప్రారంభించగా... తొలి దఫాలో ఐదు వేల సబ్బులు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత అమ్మకాలు ఊపందుకున్నాయి.బ్యాంక్ రుణం కూడా తీర్చేశారు!యూనిట్ ఆరంభమైన తర్వాత ఏడాదిలో కేవలం మూడు నెలలే గ్రూపు సభ్యులకు పని దొరికేది. షాంపూ, సబ్బులకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది వరుసగా ఎనిమిది నెలలు అంతా పని చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బ్యాంకు రుణం కూడా తీర్చేశారు. ప్రతి సభ్యురాలికి ఖర్చులు పోను కనీసం రూ.10 వేల వరకు ఆదాయం వచ్చినట్టు గ్రూప్ ట్రెజరర్ పూనెం విజయలక్ష్మి తెలిపారు.ఈ కామర్స్ దిశగా..రాబోయే రోజుల్లో ఈ కామర్స్ వేదికగా ఈ ఉత్పత్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు గ్రూపు అధ్యక్షురాలు తాటి రాజసులోచన తెలిపారు. ఈ మేరకు బ్రాండ్‌నేమ్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అది విజయవంతం అయితే మరెందరో కొత్త వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సాక్షి, భద్రాచలంఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్! -
హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్!
న్యూఢిల్లీ: అకౌంటింగ్లో అవకతవకల ఆరోపణలతో అదానీ గ్రూప్‌ను కుదిపేసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాకాజ్ నోటీసులు జారీ చేసింది. అదానీ సంస్థల స్టాక్స్ విషయంలో అనుచిత వ్యాపార విధానాలను అమలు చేశారనే ఆరోపణల మీద జూన్ 27న తమకు 46 పేజీల నోటీసు వచ్చినట్లు హిండెన్‌బర్గ్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఇది అర్ధరహితమైన చర్యగా కొట్టిపారేసింది. కార్పొరేట్ అవినీతిని, మోసాలను బహిర్గతం చేసేవారిని భయపెట్టేందుకు భారత్‌లో అత్యంత శక్తిమంతులైన వారు చేస్తున్న ప్రయత్నమని వ్యాఖ్యానించింది.అదానీ గ్రూప్ స్టాక్స్‌లో తమకు షార్ట్ పొజిషన్లు ఉన్నాయనే విషయాన్ని అధ్యయన నివేదికను ప్రకటించినప్పుడే తాము వెల్లడించామని హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఒక ఇన్వెస్టర్ తరఫున తీసుకున్న పొజిషన్లకు సంబంధించి 4.1 మిలియన్ డాలర్లు లభించాయని, సొంతంగా అదానీ అమెరికా బాండ్లను షార్ట్ చేయడం ద్వారా 31,000 డాలర్లు వచ్చాయని తెలిపింది. లీగల్ ఖర్చులు, అధ్యయనంపై చేసిన వ్యయాలకు అవి బొటాబొటీగా సరిపోయాయని వివరించింది. ఆర్థికంగా గానీ వ్యక్తిగత భద్రతపరంగా గానీ అదానీ గ్రూప్‌పై అధ్యయనం తమకు ఏమాత్రం ప్రయోజనకరమైనది కాకపోయినా ఇప్పటివరకు తాము చేసిన వాటిల్లో అత్యంత గర్వకారణమైనదిగా ఇది నిలిచిపోతుందని హిండెన్‌బర్గ్ తెలిపింది. కోటక్ గ్రూప్ పాత్ర .. అదానీ స్టాక్స్‌ను షార్ట్ చేసేందుకు తమ భాగస్వామ్య ఇన్వెస్టరు ఒకరు .. కోటక్ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ ఫండ్‌ను ఉపయోగించినట్లు హిండెన్‌బర్గ్ తెలిపింది. ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ పేరు బైటికి రాకుండా చూసేందుకే సెబీ తన నోటీసులో కోటక్‌ను ప్రస్తావించకుండా కే–ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ (కేఐవోఎఫ్) అని మాత్రమే పేర్కొందని ఆరోపించింది. సెబీ నోటీసుల ప్రకారం హిండెన్‌బర్గ్ క్లయింట్ అయిన కింగ్డన్ క్యాపిటల్.. అధ్యయన నివేదిక విడుదలకు ముందు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్కి (కేఎంఐఎల్) చెందిన కేఐవోఎఫ్లో ఇన్వెస్ట్ చేసింది.అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను షార్ట్ చేసిన కేఐవోఎఫ్ .. నివేదిక విడుదల తర్వాత పరిణామాలతో మొత్తం రూ. 183.24 కోట్ల లాభాలు ఆర్జించింది. మరోవైపు, కేఐవోఎఫ్, కేఎంఐఎల్‌కు హిండెన్‌బర్గ్ ఎన్నడూ క్లయింటుగా లేదని కోటక్ మహీంద్రా గ్రూప్ స్పష్టం చేసింది. తమ ఇతర ఇన్వెస్టర్లకు, హిండెన్‌బర్గ్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి తమకు తెలియదని పేర్కొంది. అదానీ గ్రూప్‌లో షేర్లు, అకౌంట్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 2023 జనవరిలో విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
ప్రధాని మోదీ గ్రూప్ ఫొటో షేర్ చేసిన కంగనా
లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన కంగనా రనౌత్ విజయాన్ని అందుకున్నారు. ఆమె హిమాచల్‌లోని మండీ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై ఆమె విజయం సాధించారు. తన విజయంపై కంగనా స్పందిస్తూ ఇది ప్రధాని మోదీ వల్లే సాధ్యమయ్యిందని పేర్కొన్నారు.తాజాగా కంగనా రనౌత్ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఇది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ప్రముఖ నేతలు ఉన్న గ్రూప్ ఫోటోను షేర్ చేశారు. పీఎం నరేంద్ర మోదీని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఏ) నేతగా ఎన్నుకోవడంపై కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేశారు.కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇందిరాగాంధీ పాలనా కాలంలో విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కంగనానే దర్శకత్వం వహించడం విశేషం. -
ఆ బ్లడ్ గ్రూప్ అయితే..చికెన్, మటన్ వద్దంటున్న వైద్యులు!
వారంలో కనీసం ఒక్కరోజైన ముక్క లేనిది ముద్ద దిగదు నాన్ వెజ్ ప్రియులుకు. పుటుకతో వెజిటేరియన్ అయినవాళ్లు సైతం దీని రుచికి ఫిదా అయ్యి నాన్‌వెజ్‌గా మారినోళ్లు కూడా ఉన్నారు. అందులోనూ ఆదివారం వస్తే మటన్ లేదా చికెన్ ఉండాల్సిందే. లేదంటే నోరు చచ్చిపోయినట్లు ఉంటుంది. నిజానికి శాకాహారమే ఆరోగ్యానికి మంచిది. కానీ నాన్‌వెజ్ మాత్రం రుచికి రుచి.. నాలికకు ఆ మషాల తగులుతుంటే..అబ్బా! చెబుతుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అలాంటిది వైద్యులు మాత్రం మీ బ్లడ్ గ్రూప్‌ని బట్టి చికెన్ లేదా మటన్‌ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినమని సూచిస్తున్నారు. పైగా ఆ బ్లడ్ గ్రూప్ అయితే అస్సలు తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు తినొచ్చు, ఎవరూ తినకూడదో సవివిరంగా తెలుసుకుందామా..! ఎందుకిలా వైద్యుల హెచ్చరిస్తున్నారంటే..అందరి బ్లడ్ గ్రూప్ ఒకలా ఉండుదు. అలాగే కొందరికి నాన్‌వెజ్ సులభంగా జీర్ణమవుతుంది. మరికొందరూ తినగానే పలు సమస్యలు ఫేస్ చేస్తుంటారు. అందువల్ల ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు ఏదీ తింటే బెటర్ అనేది తెలుసుకుని తినమని సూచిస్తున్నారు వైద్యులు. మనకి బ్లడ్ గ్రూప్‌లో నాలుగు రకాలు ఉన్నాయి. అవి వరుసగా ఓ, ఏ, బీ, ఏబీలు. ఈ నాలుగు బ్లడ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు తీసుకునే నాన్‌వెజ్ ఆధారంగా జీర్ణమవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయా గ్రూప్‌లోని వ్యక్తుల్లో జీర్ణశక్తి వేరువేరుగా ఉంటుంది. కొందరికి త్వరగా జీర్ణమైతే మరికొందరికి లేట్‌గా అవుతుంది. అందువల్ల ఎవరు ఎలాంటి నాన్‌వెజ్ తింటే బెటర్ అనేది సవివరంగా చూద్దాం!. 'ఏ' గ్రూప్.. ముందుగా ఏ బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీరి ఆరోగ్యం శాకాహారానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. చికెన్ లేదా మటన్ తక్కువగా తినడం మంచిది. వీళ్లు సీఫుడ్ వంటివి తినాలనుకుంటే వివిధ రకాల పప్పులను చేర్చాలి. ఈ ఆహారాలైతేనే వారికి జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి. 'బీ' గ్రూప్.. బీ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి ఎక్కువ. చికెన్, మటన్ వంటి ఏ మాంసాహారం అయినా హాయిగా తినొచ్చు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం కూడా ముఖ్యమనేది గ్రహించాలి. ఇక 'ఏబీ', 'ఓ' గ్రూప్‌ల వ్యక్తులు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీఫుడ్ తినొచ్చు. కాగా, కొందరికి మాత్రం జీర్ణసమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా తింటే వెంటనే కడుపులో అసౌకర్యం మెుదలవుతుంది. జీర్ణమం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. దీని గురించి మరింతగా తెలుసుకునేలే మీ వ్యక్తిగత వైద్యుడిని లేదా నిపుణుల సలహాలు, సూచనలతో అనుసరించడం ఉత్తమం. (చదవండి: పాపులర్ వీడియో గేమర్‌కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!) -
రాష్ట్రంలో ‘సింటెక్స్’ పెట్టుబడి రూ.350 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వెల్స్పన్ గ్రూపు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న ‘సింటెక్స్’ హైదరాబాద్‌లో రూ.350 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటో కాంపొనెంట్స్, ఇతర పరికరాలను తయారుచేసే ఈ యూనిట్ ద్వారా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వెల్స్పన్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న చందన్వెల్లిలోనే సింటెక్స్ తయారీ యూనిట్ ఏర్పాటవుతుంది. ఈ నెల 28న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావుతో పాటు వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకా హాజరవుతారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో భారీగా పెట్టుబడులతో కార్యకలాపాలు నిర్వహిసున్న వెల్స్పన్ గ్రూప్ రాష్ట్రంలో మరింత విస్తరించనుండటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో అందుబాటులోని మౌలిక వసతుల వలన అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్నాయని కేటీఆర్ అన్నారు. -
రాష్ట్రంలో మార్స్ గ్రూప్ పెట్టుబడి మరో రూ.800 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా పెంపుడు జంతువులు (పెట్స్) తినే ఆహార ఉత్పత్తుల్లో పేరొందిన ‘మార్స్ గ్రూప్’తెలంగాణలో మరో రూ.800 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో శుక్రవారం మార్స్ చీఫ్ డేటా, అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. సిద్దిపేటలో ఇప్పటికే తమ పెంపుడు జంతువుల (పెట్స్) ఫుడ్ తయారీ ప్లాంట్ ద్వారా కార్యకలా పాలు నిర్వహిస్తున్నట్లు ఆ బృందం వెల్లడించింది. మొదట కేవలం రూ.200 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించి, ఆ తర్వాత మరో రూ.500 కోట్లతో విస్తరించామని పేర్కొంది. తాజాగా మరో రూ.800 కోట్లతో విస్తరణ ప్రణాళికను చేపడతామని మార్స్ గ్రూప్ ప్రతినిధి బృందం వెల్లడించింది. పెట్ కేర్, పెట్ ఆహార ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో కేవలం తయారీకే కాకుండా పరిశోధన, అభివృద్ధి తదితర రంగాల్లో ఉన్న అవకాశాలను ఈ బృందం వివరించింది. కొత్త పెట్టుబడులు, విస్తరణలకు ప్రాధాన్యత కొత్త పెట్టుబడులు, ఇప్పటికే ఉన్న సంస్థల విస్తరణ కార్యకలాపాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. రూ.200 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించిన మార్స్ గ్రూప్ పెట్టుబడులు విడతల వారీగా రూ.1500 కోట్లకు చేరడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
స్టార్టప్‌లలో లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అంకుర సంస్థల వ్యవస్థలోకి 2030 నాటికల్లా వార్షిక పెట్టుబడుల పరిమాణం 1 లక్ష కోట్ల డాలర్లకు చేరేలా కృషి చేయాలని స్టార్టప్20 ఎంగేజ్మెంట్ గ్రూప్ నిర్దేశించుకుంది. ఇందుకోసం జీ20 దేశాధినేతలతో భేటీ కానుంది. ప్రస్తుతం స్టార్టప్ వ్యవస్థలోకి వార్షిక పెట్టుబడు లు 700 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. స్టార్టప్20 ఇండియా చెయిర్ చింతన్ వైష్ణవ్ ఈ విషయాలు తెలిపారు. పెట్టుబడుల తోడ్పాటుతో స్టార్టప్‌లు అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధికి చోదకాలుగా నిలవగలవని ఆయన చెప్పారు. అంకుర సంస్థలకు అంతర్జాతీయంగా ప్రామాణికమైన నిర్వచనాన్ని రూపొందిస్తే వాటికి పెట్టుబడులు, నిపుణుల లభ్యత మరింతగా పెరగగలదని పేర్కొన్నారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న భారత్.. జూలై 3–4న గురుగ్రామ్‌లో ’స్టార్టప్20 శిఖర్’ సదస్సు నిర్వహించనుంది. ఇందులో జీ20 సభ్యదేశాలకు చెందిన 700 పైగా అంకుర సంస్థలు పాల్గోనున్నాయి. -
జీ20 అభివృద్ధికి మన స్టార్టప్ మార్గదర్శనం
ఆవిష్కరణ–ఆధారిత ఆర్థిక పునరుద్ధరణ, పునర్నిర్మాణం, వృద్ధికి స్టార్టప్‌లు ఇంజిన్‌గా మారాయి. ప్రతి దేశంలో పెరుగుతున్న అవసరాలు, భవిష్యత్తు విలువ ఆధారిత పంపిణీ నిర్మాణంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 90 ట్రిలియన్ల డాలర్లుగా ఉంది. దీనిలో స్టార్టప్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 3 ట్రిలియన్ల డాలర్ల వరకు ఉంది. స్టార్టప్ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వేగంగా మారుతున్న పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడానికి వినూత్న ఆవిష్కరణలు సహక రిస్తాయి. పరిస్థితులకు తగిన ఆవిష్కరణలను అందిం చగల సామర్థ్యం కేవలం స్టార్టప్‌లకు మాత్రమే ఉంది. కోవిడ్ మహమ్మారి సమయంలో స్టార్టప్‌ల ప్రాధాన్యం, సామర్థ్యం స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. స్టార్టప్‌ల పాత్ర ప్రాణాలను రక్షించడంలో మాత్రమే కాకుండా తిరిగి ఆర్థిక చైతన్యం సాధించడానికి ఉపయోగపడింది. సుస్థిర ఆర్థిక లక్ష్యాల సాధనలో ఆర్థిక వ్యవస్థలకు స్టార్టప్‌లు సహాయం చేస్తున్నాయి. దేశాలతో సంబంధం లేకుండా సహకారం, ఆవిష్కరణల రంగంలో స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. దేశాల మధ్య సహకారం, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లు వేదికలనూ, సాధనాలనూ అందిస్తున్నాయి. ఉద్యోగాల కల్పన, సాంకేతిక పురోగతి, దీర్ఘకాలిక వృద్ధి, సంక్షోభ నిర్వహణ పరంగా స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషించనున్నాయి. స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటుకు ‘జీ20’కి అధ్యక్షత వహిస్తున్న భారతదేశం చొరవ తీసుకుంది. స్టార్టప్‌లకు సహకారం అందించడం, స్టార్టప్‌లు, కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, ఇన్నోవేషన్ ఏజెన్సీలు, ఇతర కీలక పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య సహకారం పెంపొందించడానికి స్టార్టప్–20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ కృషి చేస్తుంది. భారతదేశ స్టార్టప్ రంగంలో నేడు 107 యునికార్న్‌లు, 83,000 కంటే ఎక్కువ గుర్తింపు పొందిన స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. వీటి అభివృద్ధికి అవసరమైన ఆవిష్కరణ రంగం సమర్థంగా పనిచేస్తోంది. భారతదేశ స్టార్టప్ రంగం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ రంగంగా గుర్తింపు పొందింది. కొత్తగా ప్రారంభించిన స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ద్వారా జీ20 దేశాలలో వ్యూహాత్మక సహకారం ద్వారా వినూత్న స్టార్టప్‌లకు సహకారం అందించి ప్రపంచంలో సమగ్ర స్టార్టప్ వ్యవస్థ అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది. జీ20లో సభ్యత్వం ఉన్న ప్రతి దేశం అభివృద్ధికి అవసరమైన సౌకర్యాల కల్పనకు స్వయంగా చర్యలు అమలు చేస్తోంది. స్టార్టప్–20 ఎంగే జ్మెంట్ గ్రూప్ అన్ని సభ్య దేశాలతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం ఉన్న రంగాల్లో సభ్య దేశాల మధ్య సహకారం, సమ న్వయం సాధించి ఆర్థిక సహకారానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ప్రారంభ సంవత్స రంలో అమలు చేయాల్సిన మూడు ప్రాధాన్యతా అంశాలను ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది: 1. పునాదులు, కూటముల ఏర్పాటు : జీ20 ఆర్థిక వ్యవస్థల అంతటా స్టార్టప్‌లకు బహుళ నిర్వచనాలు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యతా అంశంగా ఏకాభి ప్రాయం ద్వారా స్టార్టప్ అంటే ఏమిటి అనే అంశానికి స్పష్టత నివ్వాలనీ, దీనికి సంబంధించిన పదజాలం రూపొందించాలనీ ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది. స్టార్టప్‌ల కోసం హ్యాండ్ బుక్‌ను సిద్ధం చేయడానికి ఏకాభిప్రాయ ఆధారిత నిర్వచనాలు, పదజాలం అంచనా వేయబడతాయి. అంతేకాకుండా, జీ20 ఆర్థిక వ్యవస్థల్లో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య ప్రపంచ సహకారం పెంపొందించడానికి వ్యవస్థను రూపొందించడం, దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం తన మొదటి లక్ష్యంగా స్టార్టప్– 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ పెట్టుకుంది. 2. ఆర్థిక అంశాలు: ఆర్థిక అంశాలను రెండవ ప్రాధాన్యతా రంగంగా స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది. స్టార్టప్‌లకు సులువుగా నిధులు అందేలా చేయడం, సహకారం అందించడం, నూతన అవకా శాలు గుర్తించడం లాంటి అంశాలకు రెండవ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. 3. సమగ్ర, సుస్థిర అభివృద్ధి: కీలకమైన ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు) వ్యత్యాసాలను తగ్గించి వేగంగా అభివృద్ధి సాధించడానికి అవసరమయ్యే పరిస్థితులు కల్పించే అంశాన్ని స్టార్టప్–20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ మూడవ ప్రాధాన్యతా రంగంగా గుర్తిం చింది. దీనిలో భాగంగా ఒకే విధమైన ప్రయోజనాల కోసం వివిధ దేశాల్లో పనిచేస్తున్న సంస్థల మధ్య సమన్వయం (మహిళా పారిశ్రామికవేత్తలు లాంటివి) సాధించే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. జీ20 దేశాల్లో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న తన లక్ష్యాన్ని సాధించడానికి స్టార్టప్–20 కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. స్టార్టప్ 20 దీనిలో భాగంగా 6 కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రారంభ కార్యక్రమం 2023 జనవరి 28న (హైదరాబాద్) జరుగుతుంది. శిఖరాగ్ర సదస్సు 2023 జూలై 3న (గురుగ్రామ్‌లో) జరుగుతుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి. అదనంగా, భారతదేశ స్టార్టప్ రంగం సాధించిన అభివృద్ధిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొని రావడానికి భారీ స్టార్టప్ షోకేస్ నిర్వహించాలన్న ఆలోచన కూడా ఉంది. జీ20 సభ్య దేశాలు ఆమోదించి అంగీకరించే విధాన ప్రకటనను స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ సిద్ధం చేసి అందజేస్తుంది. చర్చల ద్వారా మార్గ దర్శకాలు, ఉత్తమ విధానాలు, వ్యవస్థలు, ముఖ్యమైన తీర్మానాల లాంటి అంశాలకు సంబంధించి స్టార్టప్–20 ప్రచురణలు తీసుకు వస్తుంది. స్టార్టప్ రంగ అభివృద్ధికి దోహదపడే విధంగా ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన భారతదేశ పరిశీ లనలో ఉంది. అభివృద్ధి, సమన్వయ కార్యక్రమాలకు ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ వేదికగా పనిచేస్తుంది. జీ20 అధ్యక్ష హోదాలో భారతదేశం ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే స్ఫూర్తిని ప్రపంచానికి అందించాలని భావిస్తోంది. అదే స్ఫూర్తితో, స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ స్టార్టప్‌లకు సహకారం అందించి అన్ని దేశాల మధ్య సమన్వయం సాధించడానికి కృషి చేస్తుంది. విభిన్న భాగస్వామ్యం ద్వారా అందరి భవిష్యత్తులో స్టార్టప్‌ను ఒక భాగంగా చేయడానికి ప్రపంచ దృక్పథంతో పనిచేయాలని స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఆకాంక్షిస్తోంది. (క్లిక్ చేయండి: గుజరాత్, హిమాచల్ ఫలితాలు; వాస్తవాలు గ్రహించాల్సింది ఎవరు?) - డాక్టర్ చింతన్ వైష్ణవ్ మిషన్ డైరెక్టర్, అటల్ ఇన్నోవేషన్ మిషన్; స్టార్టప్–20 అధ్యక్షుడు -
టీపీసీసీ కొత్త కమిటీ ప్రకటన.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డి తొలగింపు..
-
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. ఏకంగా 165 మందికి జాక్‌పాట్! ఎలా ?
న్యూఢిల్లీ: ఎవరైనా ఒక వ్యక్తికి అనూహ్యంగా ఏదైనా మంచి జరిగితే కలిసి వచ్చిన అదృష్టం అనుకుంటాం. కానీ అనుకోకుండా అదృష్ట దేవత తలుపు తట్టడంతో గ్రామంలో ఏకంగా 165మందికి జాక్‌పాట్ తగిలింది. బెల్జియంలోని ఒక గ్రామంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. దీంతో క్రిస్మస్ ముందే వచ్చిందంటూ వారంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. దాదాపు 165 మంది అకౌంట్లో ఏకంగా (15,11,83,056 డాలర్లు) ఒక్కొక్కరికీ రూ.7.50 కోట్లు జమ అయ్యాయి. ఇదేదో సినిమా స్టోరీలా అనిపించినా.. నిజంగా మిరాకిల్ జరిగింది. వివరాల్లోకి వెళితే ఆంట్వెర్ప్లోని ఉత్తర బెల్జియంలోని ఓల్మెన్ అనే చిన్న గ్రామానికి చెందిన 165 మంది వ్యక్తులు విజేతలుగా నిలిచారని యూరో న్యూస్ నివేదించింది. యూరో మిలియన్స్ లాటరీలో ఓల్మెన్ వాసులు దాదాపు 165 మందిని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. ఓల్మెన్‌లో దాదాపు 4000 మంది జనాభా ఉండగా, ప్రతి 24 మందిలో ఒకరు విజేతలు. అయితే గ్రామానికి చెందిన ఒక్కొక్కరు కొంత మొత్తాన్నిచందాగా వేసుకుని ఉమ్మడిగా యూరో మిలియన్ లాటరీ టికెట్స్‌ను కొనుగోలు చేశారు. అంతే వారికి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.1200 కోట్ల విలువైన నగదు గెలుచుకున్నారు. ఫలితంగా ఒక్కొక్కరి ఖాతాలో దాదాపు రూ.7.50కోట్లు జమయ్యాయి. దీంతో ఈ ఏడాది బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ అంటూ ఆ 165 మంది ఆనందంతో మునిగి తేలుతున్నారు. గత కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలుచేస్తున్నప్పటికీ ఇప్పటికి అదృష్టం వరించింది, మరోవైపు లాటరీ గెల్చుకున్నవారంతా ఇప్పటికీ నమ్మలేకపోతున్నారని లాటరీ షాప్ యజమాని విమ్ వాన్ బ్రోకోవెన్ చెప్పాడు. ఇంతమందికి ఒకేసారి లాటరీ రావడం తనకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. విజేతలలో ఇరవై ఏళ్ల యువతి తనకు, తన కుక్కల కోసం ఇల్లు కొనాలని యోచిస్తోందని తెలిపాడు. ఇప్పటివరకు అతిపెద్ద గ్రూప్‌గా ఇంత పెద్దమొత్తంలోలాటరీ గెల్చుకోవడం ఇదే తొలిసారి అని బెల్జియం లాటరీ ప్రతినిధి జోక్ వెర్మోరే వ్యాఖ్యానించారు. అయితే విజేతల వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. కేవలం 15 యూరోల పెట్టుబడికిగాను ఈ నగదును గెల్చుకోవడం సంచలనంగా మారింది. -
Germany: ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చే భారీ కుట్ర భగ్నం
బెర్లిన్: జర్మనీలో భారీ కుట్ర భగ్నం అయ్యింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలపై వాళ్లను ఆధీనంలోకి తీసుకున్నారు. తనిఖీల్లో సుమారు 25 మందిని అరెస్టు చేశారు. అతివాదులు, మాజీ సైనిక దిగ్గజాలు ఈ కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. పార్లమెంట్ భవనాన్ని చుట్టు ముట్టి, అధికారాన్ని చేజిక్కించుకోవాలని అతివాదులు ప్రయత్నిస్తున్నట్లు అనుమానించారు. రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హెన్రిచ్-13 ఈ ప్రణాళికలు వేసినట్లు అంచనా వేస్తున్నారు. సుమారు మూడు వేల మంది పోలీసులు.. 150 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర చేసిన బృందంలో సుమారు 50 మంది ఉన్నట్లు భావిస్తున్నారు. రీచ్‌బర్జర్ తీవ్రవాదులు ఈ పన్నాగంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల..
-
Viral Video: దున్నపోతుతో యవ్వారం.. దెబ్బకు గాల్లో ఎగిరి పడ్డారు..
చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు. మనం ఏం చేసినా అది మనకు తప్పక తిరిగి వస్తుందని భావిస్తుంటారు. ఎవరికైనా మంచి చేసినా లేదా హాని తలపెట్టినా దాని ఫలితం తప్పక అనుభవిస్తామని గట్టిగా నమ్ముతారు. అచ్చం ఇలాగే కొంత మంది తాము చేసిన ఘనకార్యానికి తక్షణ కర్మను ఎదుర్కొన్న ఘటన తాజాగా చోటుచేసుకుంది. భారత అటవీశాఖ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విటర్లో మార్చి 28న షేర్ చేసిన ఓ వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో అయిదుగురు వ్యక్తులు దున్నపోతు మీద కూర్చొని రోడ్డు మీద సవారీ చేస్తున్నారు. వీళ్లు రోడ్డుపై బైక్‌పై, గుర్రం మీద వెళుతున్న మరికొంతమందితో పోటీపడి రైడ్ చేస్తున్నారు. పక్కన వెళుతున్న వారు హారన్లు కొడుతూ ముందుకు దూసుకు వెళ్తుండటంతో.. దున్నపోతు కూడా వేగంగా వెళ్లాలని దాని మీద ఉన్న వ్యక్తులు దున్నపోతును రెండు దెబ్బలు వేశారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. చదవండి: భయానక వీడియో.. మహిళ చెవిలోకి దూరిన పీత.. ఎలా బయటకు తీశారంటే.. దెబ్బలు తిన్న దున్నపోతు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కుడివైపుకు తిరిగింది. బండి చక్రాలలో ఒకటి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బండి మీదున్న అయిదుగురు వ్యక్తులు అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై ఎగిరిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జంతువులను చిత్ర హింసలు పెడితే తగిన శిక్ష అనుభవిస్తారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ‘ఈ వీడియో మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ముగింపు ఇది. కర్మ తిరిగి పొందారు’ అని కామెంట్లు చేశారు. Karma 🙏 (Watch till the end) pic.twitter.com/4ixpQ7Z5xO — Susanta Nanda IFS (@susantananda3) March 28, 2022 -
రెండు గ్రూప్‌లు... జట్లకు సీడింగ్‌లు
న్యూఢిల్లీ: ఐపీఎల్లో రెండు కొత్త జట్ల రాకతో 2022 సీజన్ మొత్తం 74 మ్యాచ్‌లతో కొత్తగా కనిపించనుంది. ఇప్పటి వరకు ప్రతీ జట్టు మిగతా 7 టీమ్‌లతో రెండు సార్లు తలపడి లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడేది. ఇప్పుడు కూడా ఒక్కో జట్టు గరిష్టంగా 14 మ్యాచ్‌లే ఆడనుండగా, ఫార్మాట్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పేరుకు హోం, అవే మ్యాచ్‌లు అని చెబుతున్నా... టోర్నీని నాలుగు వేదికలకే పరిమితం చేయడం తో ‘సొంత మైదానం’ అనే ప్రభావం కూడా ఉండకపోవచ్చు. మొత్తం లీగ్ మ్యాచ్‌ల సంఖ్య 70 కాగా, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లుంటాయి. మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్ నిర్వహిస్తారు. ఎలా ఆడతారు? ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూప్‌లోని ఒక జట్టుతో (గ్రూప్‌లో అదే స్థానంలో ఉన్న) రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. ఇవి 10 మ్యాచ్‌లు అవుతాయి. మరో గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కలిసి మొత్తం 14 మ్యాచ్‌లు అవుతాయి. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ ‘ఎ’ గ్రూప్‌లోని నాలుగు టీమ్‌లతో పాటు గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో రెండు మ్యాచ్‌లలో తలపడుతుంది. మిగిలిన నాలుగు టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఎక్కడ ఎన్ని మ్యాచ్‌లు? 70 లీగ్ మ్యాచ్‌లలో 20 మ్యాచ్‌లు ముంబై వాంఖెడే స్టేడియంలో, 20 మ్యాచ్‌లు ముంబై డీవై పాటిల్ స్టేడియంలో, 15 మ్యాచ్‌లు ముంబై బ్రబోర్న్ స్టేడియంలో, 15 మ్యాచ్‌లు పుణే స్టేడి యంలో నిర్వహిస్తారు. నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు అహ్మదాబాద్‌లో జరిగే అవకాశం ఉంది. ఏ గ్రూప్‌లో ఎవరు? ఐపీఎల్లో ఆయా జట్ల రికార్డును బట్టి ఒక్కో జట్టుకు సీడింగ్ కేటాయించారు. సాధించిన టైటిల్స్, ఫైనల్ చేరిన సంఖ్యను బట్టి దీనిని రూపొందించారు. దాని ప్రకారమే 1వ సీడ్ టీమ్ గ్రూప్ ‘ఎ’లో, రెండో సీడ్ గ్రూప్ ‘బి’లో... ఇలా పది టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్ (సీడింగ్–1), కోల్‌కతా నైట్‌రైడర్స్(3), రాజస్తాన్ రాయల్స్ (5), ఢిల్లీ క్యాపిటల్స్ (7), లక్నో సూపర్ జెయింట్స్ (9). గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్ (2), సన్‌రైజర్స్ హైదరాబాద్ (4), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (6), పంజాబ్ కింగ్స్ (8), గుజరాత్ టైటాన్స్ (10). -
టీవీని అధిగమించనున్న డిజిటల్
ముంబై: టెలివిజన్‌ను అధిగమించి డిజిటల్ విభాగం 2022లో అతిపెద్ద మాధ్యమంగా అవతరించనుందని అంతర్జాతీయ ప్రముఖ మీడియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గ్రూప్ఎమ్ అంచనా వేసింది. 2022లో మొత్తం ప్రకటనల వ్యయం 22 శాతం వృద్ధితో రూ.1,07,987 కోట్లని లెక్కగట్టింది. ఈ మేరకు తన ‘ దిస్ ఇయర్, నెక్ట్స్ ఇయర్’ 2022 (టీవైఎన్‌వై) ప్రకటనల వ్యయ (యాడెక్స్) అంచనాల నివేదికను ఆవిష్కరించింది. నివేదిక ప్రకారం యాడ్ వ్యయాల్లో వేగంగా పురోగమిస్తున్న 10 దేశాల్లో భారత్ ఒకటి. ఈ విషయంలో దేశం తొమ్మిదవ అతిపెద్ద మార్కెట్‌గా ఉంటుంది. ప్రకటనల వ్యయ పరిమాణాల పెరుగుదలకు సంబంధించి ఐదవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మొత్తం మాధ్యమంలో డిజిటల్ షేర్ 2022లో 45 శాతానికి చేరుతుంది. ఈ విభాగంలో 33 శాతం పురోగతి ఉంటుంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే ప్రకటన ల వ్యయం 11% పెరిగి 850 బిలియన్ డాలర్లకు చేరుతుంది. డిజిటల్ వాటా ఇందులో 66%. భారత వినియోగదారు, పరిశ్రమ అభిరుచులను రూపుదిద్దే కొన్ని కీలక ధోరణులను కూడా గ్రూప్ఎమ్ తన నివేదికలో ప్రస్తావించింది. సంస్థాగత పరిస్థితులు, వినియోగదారు అభిరుచులు–స్థిరత్వం, డిజిటల్ అనుభవం, డేటా, వాణిజ్యం, పర్యావరణ వ్యవస్థ, క్రీడా వ్యాపార వృద్ధి, సాంకేతికత వినియోగం, మార్కెటింగ్ పనితీరు, టీవీ ప్రకటనల సాంకేతికత, ఆఫ్‌లైన్ మీడియా పరిణామం వంటి అంశాల్లో మార్పులు వినియోగదారు, పరిశ్రమలో కొత్త ట్రెండ్స్‌ను సెట్ చేస్తాయని నివేదిక విశ్లేషించింది. -
వాట్సాప్ యూజర్లకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కష్టకాలంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ సమయంలో ప్రపంచానికి దూరంగా, ఇంటికే పరిమితమవుతున్న తరుణంలో వాట్సాప్ కీలక ఫీచర్ ను అపడేట్ చేసింది. ఇప్పటివరకు నలుగురికి మాత్రమే అవకాశం వున్న వీడియో కాలింగ్ పరిమితిని ఇపుడు ఎనిమిదికి పెంచింది. కరోనా విస్తరణ, లాక్ డౌన్ పరిస్థితుల్లో గ్రూప్ వీడియో, ఆడియో కాలింగ్ కు ఆదరణ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అవకాశాన్ని వాట్సాప్ సమయానుకూలంగా అప్ డేట్ చేసింది. వాబేటా ఇన్ఫో అందించిన సమాచారం ప్రకారం ఈ పెరిగిన పరిమితి ఆండ్రాయిడ్ వాట్సాప్ వీ2.20.133 బీటా, ఐఫోన్ వాట్సాప్ వెర్షన్ 2.20.50.25 బీటాలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. రెండు ప్లాట్‌ఫామ్‌లలోని బీటా వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం అయితే యూజర్లు సరికొత్త బీటా వెర్షన్ కలిగి ఉండాలని వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ తెలిపింది. వాట్సాప్‌లో గ్రూప్ కాల్ చేయడానికి, కుడి ఎగువన ఉన్న కాల్ బటన్ పై క్లిక్ చేయాలి. కాల్ అనంతరం యూజర్లను యాడ్ చేసుకోవాలి. గ్రూప్ కి సంబంధించి అయితే ఎనిమిది మందికి ఒకేసారి కాల్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రూపులో ఎనిమిదికంటే ఎక్కువ వుంటే.. అపుడు ఎవరికి కాల్ చేయాలనుకుంటున్నారో వాట్సాప్ అడుగుతుంది. అలాగే కాంటాక్ట్ లో సేవ్ చేయని వారిని గ్రూపు కాల్ లోకి ఆహ్వానించలేం. 📞 WhatsApp is rolling out the new limit of participants in groups calls, for iOS and Android beta users!https://t.co/bKmyR7HQg1 The new limit is: 8 participants in group calls! — WABetaInfo (@WABetaInfo) April 21, 2020 -
రికార్డులకెక్కిన ‘గోదారోళ్ల కితకితలు’
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: గోదారోళ్ల కితకితలు పేరుతో ఏర్పాటు చేసిన ఫేస్బుక్ గ్రూప్ ఆదివారం నిర్వహించిన నాలుగో ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు ఏడు వేల మంది హాజరవడంతో భారత్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు సుబ్బరాజు తోటలో ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు. భారత్ బుక్ ఆఫ్ రికార్డ్ చీఫ్ ఎడిటర్ కె.అన్నపూర్ణ.. గ్రూప్ అడ్మిన్ ఈవీవీ సత్యనారాయణకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. సుబ్బరాజుగారితోటలో... ‘గోదారోళ్ల కితకితలు’ ఫేస్బుక్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం బొమ్మూరు జీపీఆర్ రోడ్డులోని సుబ్బరాజుగారితోటలో ఉత్సాహంగా జరిగింది. వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు ఏడువేల మంది ఈ కార్యక్రమానికి తరలిచ్చారు. బొమ్మూరు గ్రామానికి చెందిన ఈవీవీ సత్యనారాయణ 2015లో ఈ ఫేస్బుక్ గ్రూపును ప్రారంభించారు. మగవారు పట్టుపంచె, కండువా, ఆడవారు పట్టుచీరలు ధరించి హాజరయ్యారు. గోదావరి జిల్లాల ప్రత్యేకమైన తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకు, పెనుగొండ గజ్జికాయ, వివిధ రకాల పిండి వంటకాలను తయారీ చేసి గ్రూపు సభ్యులకు అందుబాటులో ఉంచారు. చిన్నారుల ఆడుకునేందుకు వివిధ రకాల ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. ఫేస్బుక్ మిత్రులు ఫొటోలు దిగేందుకు పూలతో వివిధ రకాల ఆకృతులను అందంగా అలంకరించారు. ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నాం భోజనం వరకు గోదావరి రుచులను ఆత్మీయతతో కొసరి కొసరి వడ్డించారు. వివిధ రకాల తెలుగు వంటకాలను ఫేసుబుక్ మిత్రులకు రుచి చూపించారు. ఇది నాలుగో సమ్మేళనం గోదారోళ్ల కితకితలు నాలుగో ఆత్మీయ సమ్మేళనంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు గోదావరి ప్రాంత, యాస, హాస్యంతో బాబోయ్ ఇంక నవ్వలేం అన్నట్టుగా సాగింది. కితకితల సభ్యుల కలయిక. కేవలం ఫేస్బుక్లో మాత్రమే పోస్టింగులు చేసుకునే వీరంతా ప్రత్యక్షంగా కలవడంతో ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. గోదారోళ్ల కితకితలుపై వెటర్నరీ డాక్టర్ కోటి కాపుగంటి రాసిన పాటల సీడీని తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మొదట సీడీని ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజుకు అందజేశారు. గ్రూపు సభ్యురాలికి సీమంతం గ్రూపులోని సభ్యురాలైన రావులపాలెంనకు చెందిన గర్భిణి కల్యాణికి సీమంతం నిర్వహించారు. ముందుగా ఈవీవీ సత్యనారాయణ దంపతులు, అనంతరం గ్రూపుసభ్యులు అక్షింతలు వేసి ఆశీర్వాదించారు. సారి పెట్టి శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనూహ్య స్పందన గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్ గ్రూప్ సభ్యుల ఆత్మీయ కలయికకు సభ్యుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మన యాసపై ఉన్న మమకారంతో 2015లో గ్రూపును ప్రారంభించాను. ఇప్పటికి 1,16,127 మంది సభ్యులున్నారు. నాలుగోసారి నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనం భారత్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డులలో నమోదు కావడం చాలా ఆనందంగా ఉంది. – ఈవీవీ సత్యనారాయణ, గ్రూప్ క్రియేటర్, బొమ్మూరు కలయిక అపూర్వం సోషల్ మీడియా ద్వారా ఇందరు ఒకే చోట కలవడం అపూర్వం. గోదావరి హాస్యానికి, యాసకు పెద్దపీట వేస్తూ గ్రూపు ముందుకు సాగడం అభినందనీయం. గ్రూపులో సభ్యుడిని కావడం ఆనందంగా ఉంది. – ఇరవ వెంకటసుబ్రహ్మణ్యం, హైదరాబాద్ తప్పకుండా వస్తాం గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్లో నేను కూడా ఓ అడ్మిన్. బంధువుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లకు వీలులేకపోతే మానేస్తాం గానీ, ఈ ఆత్మీయ సమ్మేళనానికి మాత్రం రాకుండా ఉండం. ముందు నుంచే ఇంటిలో వారికి నచ్చచెప్పి వచ్చి సొంతి ఇంటిలో పండగలా నిర్వహిస్తాం. బంధువులు కంటే ఈ ఫేస్‌బుక్‌లోనే మిత్రులు ఆత్మీయులుగా ఉంటాం. – బోయపాటి పద్మ, హనుమాన్ జంక్షన్ బంధాలు పెరుగుతాయి ఆత్మీయ కలయిక ద్వారా బంధాలు పెరుగుతాయి. వేలాదిమంది తరలిరావడమే ఇందుకు నిదర్శనం. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తాం. అక్కా, బావ.. పిలుపులే మా గ్రూపులో వినిపిస్తాయి. దేశవ్యాప్తంగా మా గ్రూపులో వేల మంది సభ్యులున్నారు. – అన్నందేవుల దేవీలక్ష్మీ, రాజమహేంద్రవరం -
ఆ శక్తులపై విజయం సాధిస్తాం
గువాహటి: భారత్‌లో కొందరు వ్యక్తులు, కొన్ని బృందాలు గొడవపడే ధోరణితో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఇలాంటి శక్తులపై దేశంలోని రాజ్యాంగ సంస్థలు పైచేయి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అస్సాంలోని గువాహటిలో ఆదివారం హైకోర్టు ఆడిటోరియానికి శంకుస్థాపన చేసిన అనంతరం జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ..‘ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు, గ్రూపులు జగడాలమారితనంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు కొన్ని మినహాయింపులు మాత్రమే. మన న్యాయవ్యవస్థకున్న బలమైన సంప్రదాయాలు, సంస్కృతి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు అన్నివర్గాలకు సాయం చేస్తాయి. జడ్జీలు, న్యాయాధికారులు ఎల్లప్పుడూ ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీనివల్లే న్యాయవ్యవస్థ మనుగడ సాగిస్తోంది’ అని పేర్కొన్నారు. దేశంలో 50 ఏళ్లకు మించి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు వెయ్యికిపైగా ఉన్నాయని జస్టిస్ గొగోయ్ తెలిపారు. అలాగే 25 ఏళ్లకు మించి పెండింగ్‌లో ఉన్నవి 2 లక్షలకుపైగా ఉన్నాయన్నారు. ఇలాంటి కేసుల విచారణను సత్వరం పూర్తిచేయాలని జడ్జీలను కోరారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో 90 లక్షల సివిల్ కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 20 లక్షల కేసుల్లో(23 శాతం) సమన్లు కూడా జారీ కాలేదన్నారు. జడ్జీల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలన్న తన ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
గ్రూప్–4 ప్రశ్నపత్రంలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్– 4 పరీక్ష గందరగోళంగా జరిగింది. దీంతో ఆదివారం పరీక్ష రాసిన అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. పేపర్–1 సెట్ బీలోని ప్రశ్నలు సెట్–ఏలో కనిపించాయి. ప్రశ్నపత్రంలో తలెత్తిన తప్పుల వల్ల పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. పేపర్– 1 పరీక్షలో ఏ సిరీస్ ప్రశ్నపత్రంలో విద్యార్థులకు కొన్ని పేజీలు మిస్సయ్యాయి. మరోవైపు బీ సిరీస్ నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా కొన్ని రిపీట్ అయ్యాయని విద్యార్థులు ఆరోపించారు. ఏ సిరీస్ ప్రశ్నప్రత్రంలో బీ సిరీస్‌కు చెందిన 16, 17, 18, 19, 20, 21, 45, 46, 63, 64, 65, 73, 74, 75, 90, 91, 92, 93, 100, 101, 119, 120, 121, 122, 123, 124 తదితర ప్రశ్నలు ఒక సిరీస్‌కు బదులు మరో సిరీస్‌లో వచ్చాయి. ఏ సిరీస్, బీ సిరీస్ రెండూ ఒకే ప్రశ్నపత్రంలో ఉన్నందున పరీక్ష సరిగా రాయలేకపోయామని అభ్యర్థులు ఆరోపించారు. అయితే టీఎస్ పీఎస్సీ మాత్రం కొన్ని పొరపాట్లు దొర్లినందున అందుబాటులో ఉన్న మరో పేపర్ ఇచ్చి పరీక్ష రాయించామని తెలిపింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ ఈసీఐఎల్‌లోని శ్రీచైతన్య కళాశాలలో గ్రూప్– 4 పరీక్షలు రాస్తున్న 6 అభ్యర్థులకు ఏ–1 సిరీస్ ప్రశ్నపత్రంలో బీ సిరీస్ ప్రశ్నలు వచ్చాయి. దీంతో విషయాన్ని ఇన్విజిలేటర్లకు చెప్పగా వారు టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఒక దశలో అభ్యర్థులు టీఎస్పీఎస్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షలు పూర్తయినప్పటికీ తమకు న్యాయం చేయాలని వారు టీఎస్పీఎస్సీని కోరారు. 65 శాతం హాజరు..: గ్రూప్–4 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.80 లక్షల మందికిగాను 3.12 లక్షల (65 శాతం) మంది హాజరైనట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. 1,046 కేంద్రాల్లో జరిగిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లా లో 75 శాతం మంది, ఆ తర్వాత వరంగల్, మహ బూబ్‌నగర్ జిల్లాల్లో 74 శాతం చొప్పున హాజరయ్యారని వెల్లడించారు. ఇక, ఆసిఫాబాద్ జిల్లాలో కేవలం 12 శాతం మాత్రమే హాజరైనట్లు ఆమె వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో బిల్ కలెక్టర్లు, టీఎస్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో వివిధ పోస్టులు, అలాగే టీఎస్ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. -
పదేళ్లు సడలింపు
సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రూప్–4, మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ తదితర పోస్టులకు ప్రభుత్వం పదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ శనివారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్లలో పేర్కొంది. వయోపరిమితి లెక్కింపునకు 2018 జూలై 1వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది. జనరల్ అభ్యర్థులకు సాధారణ గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుకాగా.. తాజా సడలింపుతో 44 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి వర్తిస్తుంది. దీనికి ఆయా రిజర్వేషన్ల మేరకు అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మన్‌లకు మూడేళ్లు, ఎన్సీసీ వారికి మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల మేర అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. అయితే ఆర్టీసీలోని 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం సాధారణ గరిష్ట వయోపరిమితికి, ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కలుపుకొని జనరల్ అభ్యర్థులకు 40 ఏళ్లు గరిష్ట వయోపరిమితి ఉంటుందని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మన్‌కు మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుందని వెల్లడించింది. మొత్తంగా ఆర్టీసీలోని పోస్టులకు 45 ఏళ్లు దాటినవారు మాత్రం అనర్హులని స్పష్టం చేసింది. -
వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్..
సాక్షి, న్యూఢిల్లీ: ఎట్టకేలకు వాట్సాప్ వినియోగదారులకు తీపికబురు అందింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌లో ఒకరికంటే ఎక్కువమంది గ్రూప్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండు వెర్షన్లలోనూ ఈ ఫీచర్‌ను విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఫేస్బుక్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో వాట్సాప్ వీడియో కాలింగ్ సదుపాయం ప్రవేశపెట్టబోతున్నట్లు ఫేస్బుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక గ్రూపులోని పలువురు సభ్యులు లేదా, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా అంతకుమించి సభ్యులు ఈ ఫీచర్ ద్వారా వీడియో ద్వారా సంభాషించుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ బేటా 2.18.155 వెర్షన్ వాడుతున్న ఎంపిక చేయబడిన కొంతమంది వినియోగదారులకు తాజాగా ఒక వీడియో కాల్నుఫీచర్ను వినియోగించుకోవచ్చు. ఐవోఎస్ ఆధారిత స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ 2.18.52 వెర్షన్లో ఈ గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు వాట్సాప్ వెల్లడించింది. ఇందుకోసం యూజర్లు వీడియో కాల్స్ ఆప్షన్‌ను ఎంచుకుని, మాట్లాడాలనుకున్న వారితో హ్యాపీగా మాట్లాడు కోవచ్చు. మరోవైపు ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుందని వాట్సాప్ ఫ్యావరెట్ సైట్ WaBetaInfo నివేదించింది. అయితే త్వరలోనే ప్రతి వినియోగదారుడికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. దీనికనుగుణంగానే చాలామంది వాట్సాప్ యూజర్లు ఈ కొత్త గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ఇంకా తమకు అందుబాటులోకి రాలేదని రిపోర్టు చేయడం గమనార్హం. -
మత ఘర్షణల నుంచి రాజకీయాల వైపు...
కొలంబో : ముస్లిం వ్యతిరేక అల్లర్లు చెలరేగి మత ఘర్షణలకు దారి తీయగా, ఎమర్జెన్సీ తర్వాత శ్రీలంకలో ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. అయితే ఘర్షణలకు కారణమైన సంస్థ ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. (ఘర్షణలకు కారణం ఏంటంటే...) మహసన్ బాలకాయ అనే సంస్థ ముస్లింలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు, వీడియోలు పోస్టు చేయటంతో అల్లర్లకు చెలరేగాయి. ఆ సంస్థే త్వరలో రాజకీయ అరంగ్రేటం చేయనున్నట్లు ప్రకటించింది. ‘సింహళీయుల గౌరవాన్ని కాపాడే రాజకీయ పార్టీలు ఇప్పటిదాకా లేవు. అందుకే మిగతా సింహళ సంస్థలను కలుపుకుని మహసన్ బాలకాయ పేరిట పార్టీని స్థాపించబోతున్నాం. ఇప్పటికే ఎన్నికల అధికారికి పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం’ అని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. కాగా, మహసన్ బాలకాయ సంస్థపై మత ఘర్షలతోపాటు ముస్లింలకు చెందిన స్థలాలను కబ్జా చేసిందంటూ పలు కేసులు ఉన్నాయి. క్యాండీ జిల్లాలో 70 శాతం ఉన్న సింహళ బౌద్ధులకు, 10 శాతం ఉన్న ముస్లింలకు మధ్య మార్చి6వ తేదీన అల్లర్లు చెలరేగటం.. అవి మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించటంతో ఎమర్జెన్సీని విధించింది శ్రీలంక ప్రభుత్వం. చివరకు పరిస్థితి సర్దుమణగటంతో మార్చి 18న అత్యవసర పరిస్థితిని ఎత్తేసినట్లు ప్రకటించింది. -
అధికార పార్టీలో..గుంపుల లొల్లి..!
ఆయా రాజకీయ పార్టీలనుంచి భారీ ఎత్తున చేరికలు జరిగాక అధికార టీఆర్ఎస్ కలగూర గంపలా తయారైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా ప్రతి నియోజకవర్గంలో రెండు మూడు గ్రూపులు తయారయ్యాయి. దీంతో ఎవరికి వారు వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులకు కొన్నిచోట్ల పొసగడం లేదు. మరికొన్నిచోట్ల ఇన్చార్జ్, ఇతర నాయకులు కలిసి పనిచేయలేకపోతున్నారు. ఈ పరిణామాలతో కిందిస్థాయి కార్యకర్తల్లో అయోమయం నెలకొందని పేర్కొంటున్నారు. సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా పరిధిలోని నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం నకిరేకల్, మునుగోడులను మాత్రమే దక్కించుకుంది. మిగిలిన నల్లగొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, దేవరకొండలో కాంగ్రెస్‌తో పొత్తుతో సీపీఐ విజయం సాధించాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు. ఉన్న ఐదు నియోజకవర్గాల్లో చూడబోతే నాలుగు నియోజకవర్గాలు టీఆర్ఎస్ చేతిలో ఉండడంతో ఆ పార్టీ బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ, ఆ ఐదు నియోజకవర్గాల్లో గ్రూపుల లొల్లి జరుగుతోంది. కలవని మనసులు పాత–కొత్త నాయకులు కలిసిపోయి పనిచేయాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పదే పదే చేస్తున్న సూచనలను పార్టీ నాయకులు చెవికి ఎక్కించుకోవడం లేదని టీఆర్ఎస్లోని తటస్థవర్గీయులు పేర్కొంటున్నారు. అంతా ఒక పార్టీ గొడుగుకింద ఉన్నట్లు కనిపిస్తున్నా, ఎవరికి గుంపును వారు వెనకేసుకుని సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అటు ఎమ్మెల్యేలు, ఇటు ఇన్చార్జులను కూడా లెక్కచేయని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నల్లగొండ : గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దుబ్బాక నర్సింహారెడ్డి నాలుగైదు నెలల కిందటి దాకా నల్లగొండ ఇన్చార్జ్గా వ్యవహరించారు. గతేడాది అక్టోబరులో టీడీపీనుంచి టీఆర్ఎస్లో చేరిన కంచర్ల భూపాల్‌రెడ్డికి ఇన్చార్జ్ పోస్టు ఇవ్వడంతో అంతర్గత పోరు మొదలైంది. వాస్తవానికి నల్లగొండలో కాంగ్రెస్‌నుంచి పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్లో చేరారు. అంతకు ముందు కొందరు టీడీపీ నేతలు సైతం గులాబీ కండువాలు కప్పుకున్నారు. వీరంతా దుబ్బాకతో కలిసి సర్దుకుపోయారు. కంచర్ల రాకతో సమస్య మొదలైందని, కాంగ్రెస్‌నుంచి టీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్లు కంచర్లకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. మిర్యాలగూడ : కాంగ్రెస్‌నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే భాస్కర్ రావుకు, అక్కడ పోటీచేసి ఓడిపోయిన ఇన్చార్జ్ అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి మధ్య చేతులు కలవలేదు. దీంతో పాత టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వచ్చిన చేరిన నేతలు వేర్వేరుగానే కొనసాగుతున్నారు. నాగార్జున సాగర్ : ఇక్కడ పార్టీ చేతిలో ఎమ్మెల్యే పదవి లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నోముల నర్సింహయ్య ఇన్చార్జిగా ఉన్నారు. కానీ, ఇదే నియోజకవర్గంలో ఎంసీ కోటిరెడ్డి అనే నాయకుడు అదే స్థాయిలో పార్టీలో బలంగా ఉన్నారు. వీరద్దరి గ్రూపులు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. ఇదే నియోజకవర్గానికి చెందిన రామ్‌చందర్ నాయక్‌కు జిల్లా రైతు సమన్వయ సమితి కో–ఆర్డినేటర్‌గా పదవి దక్కింది. ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంసీ కోటిరెడ్డి పాల్గొన్నారు కానీ, నియోజకవర్గ ఇన్చార్జి గైర్హాజరయ్యారు. దేవరకొండ : జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ టీఆర్ఎస్లో చేరడంతో గ్రూపుల గొడవ షురూ అయ్యింది. ఇప్పటికీ ఈ రెండు గ్రూపులు కలవడం లేదు. కార్యక్రమాలూ వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. పదవుల పంపకంలో వీరి గ్రూపులు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. మునుగోడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ల గ్రూపులు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. బయటకు అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా సంస్థాగతంగా అంత సవ్యంగా లేదని పేర్కొంటున్నారు. పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకుని స్పష్టత ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో నష్టం జరుగుతుందన్న ఆందోళన.. ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. -
ఫేస్బుక్లో కొత్త ఫీచర్..ఇలా చెక్ పెట్టొచ్చు!
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోఅద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మన ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నవారిని శాశ్వతంగా అన్‌ఫాలో లేదా అన్ ఫ్రెండ్చేయాల్సి అవసరం లేకుండానే తాత్కాలికంగా అన్‌ఫ్రెండ్ చేసే వెసులుబాటును కల్పిస్తోంది. అంటే ఫేస్బుక్లో కొంతమందిని అన్‌ఫ్రెండ్ చేయకుండానే వారి పోస్టులను తాత్కాలికంగా అంటే 30రోజులపాటు నిరోధించే అవకాశం కల్పించే ‘స్నూజ్’ అప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఫేస్బుక్ బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. ఫేస్బుక్లో మన స్నేహితులను, పేజీలను లేదా గ్రూపులను తాత్కాలింకంగా నియంత్రించేలా ఈ సరికొత్త అవకాశాన్ని అందిస్తోంది. అన్‌ఫాలో, హైడ్, రిపోర్ట్, సీ ఫస్ట్ తోపాటు స్నూజ్ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ స్నూజ్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఆ సమయంలో మీ న్యూస్ఫీడ్లోని వ్యక్తులు, పేజీలు లేదా గ్రూపులు షేర్ చేసిన కంటెంట్‌ను మీరు మ్యూట్ చేసుకోవచ్చని ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజర్ శృతి మురళీధరన్ తెలిపారు. తాజా ఫీచర్ ప్రకారం ఎవరి పోస్టులైనా మనకు తాత్కాలికంగా నచ్చకపోతే వారిని 30 రోజుల పాటు ఆపవేసే అవకాశాన్ని ఇపుడు కల్పిస్తోంది. అంటే ఫేస్బుక్న్యూస్ఫీడ్లో 30 రోజులు మనకు నచ్చని వారి పోస్టులు మన దృష్టికిరావు. ఈ గడువు అనంతరం 'తాత్కాలిక వ్యవధి' ముగిసే సమయానికి ఫేస్బుక్ మనకి నోటిషికేషన్ ఇస్తుంది. అనంతరం వారి పోస్టులు తిరిగి పొందాలనుకుంటే పునరుద్ధరించుకోవచ్చు లేదంటే మరో 30 రోజుల పాటు అదే ఆప్షన్ కొనసాగించవచ్చు. -
గ్రూప్ అడ్మిన్లకు రిలీఫ్.. వాట్సాప్ కొత్త ఫీచర్
శాన్‌ఫ్రాన్సిస్కోః ఫేస్బుక్ సొంతమైన ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సౌలభ్యాన్ని అందిస్తోంది. ముఖ్యంగా గ్రూప్ అడ్మిన్లకు ఊరట కల్పించేలా సరికొత్త వెసులుబాటు కల్పిస్తోంది. . డిలిట్ ఫర్ ఎవ్రీ వన్ పేరుతో ఈ కొత్త ఫీచర్‌తో అప్ డేట్ చేస్తోంది. అతి త్వరలోనే దీన్ని యూజర్లకు అందుబాటులోకి తేనుంది. దీని ప్రకారం వాట్సాప్ లో పోస్ట్ అయిన మెసేజ్‌ను అడ్మిన్ ఎంచుకున్న గ్రూపు సభ్యుల్లో ఇతరులు డిలిట్ చేసే అవకాశాన్నికల్పిస్తోంది. వాబేటా ఇన్ఫో. కాం అందించిన సమాచారం ప్రకారం గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాం వెర్షన్ 2.17.387 లో వాట్సాప్ సమర్పించింది. గ్రూప్ మేనేజ్మెంట్ కోసం, గ్రూప్ అడ్మిన్ రక్షించే ప్రయత్నంలో గ్రూప్ డీపీని మార్చడం సహా ఇతర విషయాలను ఎడిట్ చేసే సభ్యులను ఎంచుకునే అవకాశాన్నివ్వనుంది. దీని ద్వారా గ్రూపులో ఏదైనా పోస్ట్‌ను, మెసేజ్‌ను ఇతర గ్రూప్ అడ్మిన్లు డిలిట్ చేసే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోందని నివేదించింది. ప్రస్తుతం పరీక్ష దశల్లో ఈ ఫీచర్ విజయవంతమైన అనంతరం యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లకు టెస్టింగ్ టీజర్‌ను ఒకటి విడుదల చేస్తుంది. అలాగే బ్యాంక్ టు బ్యాంక్ నగదు ట్రాన్స్ఫర్ చేసుకునేలా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపిఐ సర్వీసును కూడా త్వరలోనే ప్రారంభించనుందట. కాగా అన్‌సెండ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఇటీవల వాట్సాప్ ప్రకటించింది. ఈ ఫీచర్‌ద్వారా దీనిద్వారా అయిదు నిమిషాల్లో టెక్ట్స్ మెసేజ్, ఇమేజ్,జిఫ్ లతోపాటు స్టేటస్ రిప్లైని కూడా డిలిట్ చేయవచ్చని వెల్లడించిన సంగతి తెలిసిందే.