-
క్రికెట్ నేపథ్యంలో హిట్ కొట్టిన సినిమాలు.. ఈ ఓటీటీలలో చూడొచ్చు
వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ సత్తా చాటి మరికొన్ని గంటల్లో నేడు ఆస్ట్రేలియాతో ఫైనల్ ఫైట్‌కు రెడీ అయింది. లీగ్ దశలో పరాజయమే లేకుండా విజయ పరంపరతో కొనసాగిన భారత జట్టు.. అదే దూకుడుతో ఫైనల్ మ్యాచ్‌లోనూ వీర విజృంభణతో దూసుకెళ్లి కప్ సాధించాలని కోట్లాది మంది భారతీయులు ఆశిస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా నేటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ఉద్యోగులూ, వ్యాపారులూ, సినీ సెలబ్రెటీలు తదితర క్రికెట్ క్రీడాభిమానులంతా సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు. ఆ సినిమాలో ఏ ఓటీటీలో ఉన్నాయో అని తెగ వెతుకుతున్నారు. సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ 2017లో 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' అనే చిత్రాన్ని జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించారు. భారతీయ త్రిభాషా డాక్యుమెంటరీ స్పోర్ట్స్ చిత్రంగా తెరకెక్కించారు. 200 నాటౌట్ ప్రొడక్షన్స్, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రవి భాగ్చంద్కా, శ్రీకాంత్ భాసీ నిర్మించారు . ఈ చిత్రం భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీ.ఇది టెండూల్కర్ క్రికెట్, వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా చూపించారు. అలాగే అతని జీవితంలో ఇంతకు ముందెన్నడూ వినని లేదా చూడని కొన్ని అంశాలను కూడా ఈ చిత్రంలో చూడవచ్చు. ఇందులో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్ కూడా కొన్ని సీన్స్‌లలో కనిపిస్తారు. ఈ చిత్రం చూడాలనుకుంటే సోనీ లైవ్‌లో అందుబాటులో ఉంది. MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ 2016లో MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రం విడుదలైంది. ధోని బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. నీరజ్ పాండే రచించి దర్శకత్వం వహించారు. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగారూపొందించబడింది. ఈ చిత్రంలో MS ధోనిగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించారు , వీరితో పాటు దిశా పటానీ , కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్ నటించారు. ఈ చిత్రం ధోని చిన్నప్పటి నుంచి జీవితంలోని అనేక సంఘటనల ద్వారా అతని జీవితాన్ని వివరిస్తుంది. ధోనీ అంగీకారంతో ఈ సినిమా మొదలైంది. 61 దేశాలలో ఈ సినిమా విడుదలైంది. వాణిజ్యపరంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇది 2016లో అత్యధిక వసూళ్లు చేసిన ఐదవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా రూ. 215.48 కోట్లు వసూలు చేసిన ఆరవ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను చూడాలనుకుంటే.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉచితంగానే చూడొచ్చు. 800 ముత్తయ్య మురళీధరన్ 2023లో తెలుగులో ఈ సినిమా విడుదలైంది. శ్రీలంక స్టార్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ పై శివలెంక కృష్ణప్రసాద్ దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేశాడు. మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ ఉన్నారు. అందుకే ఈ చిత్రానికి 800 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. 'ఆజార్' 2016లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా 'ఆజార్' అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ద్వారా శోభా కపూర్, ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ టైటిల్ రోల్లో సూపర్‌గా మెప్పించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 13 మే 2016న విడుదలైంది . అజార్ జీవితంలో మ్యాచ్ ఫిక్సింగ్, వివాహేతర సంబంధం వంటి అంశాలపై కూడా ఈ చిత్రంలో క్లారిటీ ఇచ్చారు. అజార్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలో ఇవే ► నాని నటించిన జెర్సీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతుంది. ► గోల్కోండ హైస్కూల్ (సన్‌నెక్ట్స్) ► కౌసల్య కృష్ణమూర్తి (సన్‌నెక్ట్స్) ► విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' (అమెజాన్,డిస్నీ హాట్‌స్టార్) ► నాగచైతన్య 'మజిలీ' (అమెజాన్ ప్రైమ్ వీడియో) ► వెంకటేష్ 'వసంతం' (డిస్నీ హాట్‌స్టార్) ► లగాన్ హిందీ (నెట్‌ఫ్లిక్స్) -
నాకు సిగ్గు ఎక్కువ.. మేనేజ్ చేశా: సచిన్
హైదరాబాద్: తన జీవితానికి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలు ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ సినిమాలో ఉన్నాయని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపాడు. బయోపిక్ గురించి అడిగినప్పుడు చేయాలా, వద్దా చాలా ఆలోచించానని ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. నా గురించి అభిమానులు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారని అర్థమైందని, అందుకే బయోపిక్‌లో నటించానని వెల్లడించాడు. మొదట్లో కెమెరా ముందు ఇబ్బంది పడ్డానని, తర్వాత అలవాటైందన్నాడు. తనకు సిగ్గు ఎక్కువని, సినిమాలో బాగానే మేనేజ్ చేశానని చెప్పాడు. తన సినిమా చూసిన తర్వాత అభిమానులు పూర్తి సంతృప్తి చెందుతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. నా జీవితంలో పెద్దగా దాచింది ఏమీ లేదని, దీన్ని ఇతర బయోపిక్‌లతో పోల్చుతారనుకోవడం లేదన్నాడు. హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడ నాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాడు. హైదరాబాద్‌లో ఎండలు ఎక్కువగా ఉన్న ఫ్యాన్స్ చల్లదనాన్ని పంచుతారని పేర్కొన్నాడు. సినిమాకు సంబంధించిన తర్వాత ఇన్నింగ్స్ ఉండదని స్పష్టం చేశాడు. స్వరమాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ తనకు మంచి మిత్రుడని, ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యారని ప్రశంసించాడు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మళ్ళీ చెపుతున్న..!
భర్త పై పోస్ట్ వైరల్: అమలాపాల్
మీ బ్రెయిన్ ఆక్టివ్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి!
అస్సలు తగ్గేదే లే.. నంద్యాలలో శిల్పాతో పుష్పరాజ్ (ఫొటోలు)
తెలంగాణలో రాహుల్, కాంగ్రెస్‌కు ఇచ్చిపడేసిన అమిత్ షా
చంద్రబాబుకు చివరి పంచ్.. బాంబు పేల్చిన శర్మాజీ!
‘జైలును తప్పించుకునేందుకే పార్టీ ఫిరాయించాను’
బాలకృష్ణ, దత్తపుత్రుడికి జిరాక్స్ కాపీలిచ్చారా?: సీఎం జగన్
‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ఏంటి? ఫిజికల్ రిలేషన్ షిప్‌కు ఎందుకు తావులేదు?
సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్ పై తొలిసారి స్పందించిన అదితిరావు హైదరీ
తప్పక చదవండి
- సీఎం జగన్‌కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
- టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- కుప్పంలో టీడీపీ గూండాయిజం
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement