ఇంటర్‌ విద్యలో డిజిటల్‌ సేవలు | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యలో డిజిటల్‌ సేవలు

Published Wed, Jan 31 2024 5:55 AM

Digital services in inter education - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించేందుకు బోర్డు డిజిటల్‌ విధానాలను అనుసరిస్తోంది. ఇప్పటికే డిజి లాకర్‌లో 2006 నుంచి 2023 మధ్య ఇంటర్మీడియట్‌ పాసైన 68.73 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచగా, ఈ ఏడాది నుంచి ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్‌ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్‌లైన్‌ విధానంలోకి మార్చింది.

దీంతో విద్యార్థులు, పాఠ­శా­లల యాజమాన్యాలకు సమయాభావం తగ్గడంతో పాటు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చినట్లయింది. గతంలో చలాన్‌ రూపంలో ఫీజు చెల్లించగా, వాటిని పరిశీలించి మదింపు చేసేందుకు బోర్డుకు చాలా సమయం పట్టేది. కానీ, ఈ ఏడాది ఫీజులను, నామినల్‌ రోల్స్‌ను కూడా ఆన్‌లైన్‌ చేయ­డంతో గత ఇబ్బందులన్నీ తొలగించినట్లయింది. 

ఇంటర్‌ పరీక్షలకు 9,59,933 మంది..
ఇక మార్చి 1 నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరంలో 5,17,591 మంది, రెండో ఏడాది 4,45,342 మంది మొత్తం 9,59,933 మంది పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 పరీక్షా కేంద్రాలను సిద్ధంచేశారు. ఇప్పటికే ఆయా జూనియర్‌ కాలేజీల్లోని పరీక్ష జరిగే గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. అలాగే, ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌ పరీక్షలకు 2,130 సెంటర్లను సిద్ధంచేశారు.

ఈసారి ప్రాక్టికల్స్‌ పూర్తయిన వెంటనే మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్‌ బోర్డు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడా పొరపాట్లు జరగ­కుండా ఎగ్జామినర్‌ రెండుసార్లు ఆన్‌లైన్‌లో మార్కులు నమోదు చేసేలా చర్యలు తీసుకున్నా­మని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. ఇకపై ఇదే ఆన్‌లైన్‌ విధానం కొనసాగుతుందన్నారు.

డిజిలాకర్‌లో 68.73 లక్షల సర్టిఫికెట్లు..
రాష్ట్రంలో ఇంటర్‌ పాసైన విద్యార్థులు తమ సర్టి­ఫి­కెట్లను ఆన్‌లైన్‌లో సులభంగా పొందే వెసులు­బాటును ఇంటర్‌ బోర్డు అందుబాటు­లోకి తెచ్చింది. పాస్‌ సర్టిఫికెట్, మైగ్రేషన్, ఈక్వ లెన్సీ, జె న్యూనెస్‌ సర్టిఫికెట్లు ఎప్పుడు కావాలన్నా తీసుకునేలా ‘డిజిలాకర్‌’ (https://digilocker.gov.in)లో ఉంచింది. ఇందు­కోసం ‘జ్ఞానభూమి’ ని డిజిలా­కర్‌­కు అను­సంధానించింది. ఇందులో ఇప్పటి­వరకు 2006 నుంచి 2023 వరకు ఇంటర్‌ పూర్తి­చేసిన 68,73,752 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అం­దుబాటులో ఉంచారు.

సర్టిఫి కెట్లలో తప్పు­పడిన పేరును సరిది­ద్దేందుకు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీలను సవరించడం వంటి ఇతర సేవలను కూడా ఆన్‌లైన్‌లో డిజిటల్‌ ప్లాట్‌­ఫామ్‌ ద్వారా విద్యా­ర్థులు పొందవచ్చు. డిజి లాకర్‌గా పిలుస్తున్న ‘డిజిటల్‌ డాక్యుమెంట్స్‌ రిపోజిటరీ’­లో ఇంటర్‌ పరీక్షలు పూర్తిచే­సిన విద్యార్థులు తమ పత్రాలను పొందవచ్చు. గతంలో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారు ‘డూప్లి­కేట్‌’ పొందాలంటే పోలీసు వి భాగం ఎన్‌ఓసీ, నోటరీ అఫిడవిట్‌తో దరఖాస్తు చేయడ­ంవంటి వ్యయప్రయాసలు పడాల్సి వచ్చే ది. ఈ ప్రక్రియకు స్వస్తి పలుకుతూ డిజి లాకర్‌­తో జ్ఞానభూమిని అనుసంధానం చేయడంతో విద్యార్థి తన మొబైల్‌ ఫోన్‌లోని డిజిలాకర్‌ యాప్‌ ద్వారా సర్టిఫికెట్లను ఎప్పుడైనా, ఎక్కడైనా పొందే విధానాన్ని బోర్డు అందుబాటులోకి తెచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement