తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే? | Raghava Lawrence Gift MG Hector Car His Brother | Sakshi
Sakshi News home page

Lawrence: లక్షలు విలువ చేసి కారు.. అందుకే బహుమతిగా ఇచ్చాడు

Jun 1 2024 1:10 PM | Updated on Jun 1 2024 1:33 PM

Raghava Lawrence Gift MG Hector Car His Brother

సెలబ్రిటీలు కొత్త కార్లు తీసుకోవడం లేదంటే వాటిని మరొకరికి గిఫ్ట్ ఇవ్వడం లాంటివి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ జాబితాలోకి కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా మారిన రాఘవ లారెన్స్ చేరారు. దాదాపు రూ.25 లక్షలు విలువ చేసే ఖరీదైన కారుని తన తమ్ముడికి బహుమతిగా ఇచ్చాడు. ఫొటో పోస్ట్ చేసి మరీ ఈ విషయాన్ని బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గ్రాండ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్‌ ఎంతంటే?)

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్.. దక్షిణాది భాషల్లో స్టార్ హీరోలతో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యాడు. తెలుగులోనూ నాగార్జునతో 'డాన్' మూవీ తీశాడు. అనంతరం కొన్నాళ్ల తర్వాత పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు. 'కాంచన' లాంటి హారర్ సినిమాలతో ఎంతలా భయపెట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

గతేడాది 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీతో హిట్ కొట్టిన లారెన్స్.. ప్రస్తుతం తమిళంలో రెండు మూవీస్ చేస్తున్నాడు. అలానే తన తమ్మడు ఎల్విన్‌ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నాడు. 'బుల్లెట్' పేరుతో తీస్తున్న మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా చూసిన లారెన్స్.. తమ్ముడి ఫెర్ఫార్మెన్స్ బాగా నచ్చడంతో ఎమ్‌జీ హెక్టార్ కారుని బహుమతిగా ఇచ్చాడు. మార్కెట్‌లో దీని ధర రూ.20-25 లక్షల పైమాటే అని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 'భజే వాయువేగం' సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement