బడుగు, బలహీనవర్గాల అధికారులపైనే పచ్చకుట్ర | TDP Conspiracy Against Poor And Underprivileged Officials, Details Inside | Sakshi
Sakshi News home page

బడుగు, బలహీనవర్గాల అధికారులపైనే పచ్చకుట్ర

Published Mon, May 13 2024 5:59 AM

TDP conspiracy against poor and underprivileged officials

ఎన్నికల విధుల్లో లేకుండా దుష్ట పన్నాగం 

ఈసీ బదిలీ చేసిన అధికారుల్లో 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలే  

రెడ్డి సామాజికవర్గం అధికారులపైనా అదే పన్నాగం.. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ చంద్రబాబు కుతంత్రం

సాక్షి, అమరావతి : బడుగు, బలహీనవర్గాలంటే ఎంతటి ద్వేషమో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా చాటుకున్నారు. తాను అధికారంలో ఉండగా బీసీలు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకున్న ఘనుడీయన. అత్యంత అవినీతిపరుడైన తన సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వర రావు వంటి అధికారులను అడ్డం పెట్టుకుని కేంద్ర భద్రతా చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ ఎన్నికల అక్రమాలకు పాల్పడిన బరితెగింపు చరిత్ర కూడా ఆయనదే. ప్రస్తుతం ఎన్నికల్లోనూ టీడీపీ ఓటమి తప్పదని తేటతెల్లం కావడంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు.

అందుకే ఏకంగా అధికార వ్యవస్థను బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ అధికారులే లక్ష్యంగా కుట్రలకు తెగించారు. దాంతో పాటు రెడ్డి సామాజికవర్గం అధికారులపైనా కుట్రపూరితంగా దు్రష్పచారం చేస్తున్నారు. ఆ సామాజికవర్గాల అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పక్కా పన్నాగాన్ని అమలు చేస్తున్నారు. తద్వారా ఎన్నికల్లో తమ అక్రమాలకు అడ్డు లేకుండా చేసుకోవాలన్నది చంద్రబాబు లక్ష్యం.

అందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్ట, రెడ్డి సామాజికవర్గాల అధికారులపై కొంతకాలంగా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేస్తున్నారు. అవాస్తవాలు, అసత్య ఆరోపణలతో ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. బీజేపీతో జట్టు కట్టిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, తన వదిన దగ్గుబాటి పురందేశ్వరిని కూడా చంద్రబాబు తన పన్నాగంలో భాగస్వామి­ని చేసి, ఉమ్మడి కుట్రకు తెరతీశారు. టీడీపీ ఇచి్చన స్క్రిప్ట్‌ మేరకు పురందేశ్వరి కూడా అవే అసత్య ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నారు.

చంద్రబాబు ఏ సామాజికవర్గాల అధికారులపై అసత్య ఆరోపణలు చేశారో.. సరిగ్గా ఆ అధికారులపైనే పురందేశ్వరి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆ సామాజికవర్గాలకు చెందిన అధికారుల నిబద్ధత, సమర్థతపై అపవాదులు వేస్తున్నారు. అనంతరం ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆ బడుగు, బలహీనవర్గాలు, రెడ్డి సామాజికవర్గ అధికారులను హఠాత్తుగా బదిలీ చేయిస్తున్నారు. ఆ అధికారులను ఆత్మన్యూనతకు గురి చేసి వేధిస్తున్నారు.  

బడుగు, బలహీనవర్గాలే సమిధలు 
చంద్రబాబు, పురందేశ్వరి ఈసీకి పదే పదే చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్న  పేర్లలో 70% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం మైనార్టీల అధికారులే. రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికారులు 20% ఉన్నారు. టీడీపీ, బీజేపీ ఒత్తిడితో ఈసీ ఇప్పటివరకు బదిలీ చేసిన, చార్జ్‌ మెమో­లు జారీ చేసినవారిలో ఏకంగా 90% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం, రెడ్డి సామాజికవర్గాలకు చెందినవారే ఉన్నా­రు. చంద్రబాబు కుట్ర­కు తలొగ్గి ఈసీ ఇప్పటివరకు 29 మంది అధికారులను బదిలీ చేసింది.

వారిలో 14 మంది అంటే దాదాపు 50% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం మైనారీ్టలకు చెందిన అధికారులే. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు 11 మందిని బదిలీ చేసింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన మరో ముగ్గురికి చార్జ్‌ మెమోలు జారీ చేసింది. అంటే మొత్తం 14మందిపై చర్యలు తీసుకుంది. అంటే టీడీపీ కుట్రలతో బదిలీ అయినవారిలో ఎస్సీ, ఎస్టీ, మైనారీ్ట, రెడ్డి సామాజికవర్గాలకు చెందిన  అధికారులే 90% ఉండటం విభ్రాంతి కలిగిస్తున్న వాస్తవం. బ్రా­హ్మణ, బలిజ, క్షత్రియ సామాజికవర్గాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు.

చంద్రబాబు ఒత్తిడితో ఈసీ బదిలీ చేసిన అధికారుల జాబితా ఇలా ఉంది.. 
ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు 
∙పి. రాజా బాబు (కలెక్టర్, కృష్ణా జిల్లా)  
∙పీఎస్‌ గిరీషా (కలెక్టర్, అన్నమయ్య జిల్లా) 
∙కల్పనా కుమారి (పీవో, సీతంపేట   ఐటీడీయే, పార్వతీపురం మన్యం జిల్లా) 
∙జి. పాలరాజు (ఐజీ, గుంటూరు) 
∙కేకేఎన్‌ అన్బురాజన్‌ (ఎస్పీ, అనంతపురం జిల్లా) 
∙పి. జాషువా (ఎస్పీ, చిత్తూరు జిల్లా) 
∙పి.శరత్‌ బాబు (సీఐ, మాచర్ల) 
∙వంగా శ్రీహరి (ఎస్సై, వెల్దుర్తి) 

ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారు 
∙జి. లక్ష్మీశా (కలెక్టర్, తిరుపతి జిల్లా) 
∙ఇ. మారుతి (ఎస్సై, సదుం, చిత్తూరు జిల్లా) 

బీసీ సామాజికవర్గానికి చెందినవారు 
∙టి. కాంతి రాణా (పోలీస్‌ కమిషనర్, విజయవాడ)  
∙సీహెచ్‌. అంజు యాదవ్‌ (సీఐ, శ్రీకాళహస్తి) 
∙చిన మల్లయ్య (సీఐ, కారంపూడి) ముస్లిం మైనారీ్టలు 
∙మహబూబ్‌ బాషా (డీఎస్పీ, రాయచోటి)

రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు 
∙కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి (డీజీపీ) 
∙ఆర్‌.ఎన్‌. అమ్మిరెడ్డి (డీఐజీ, అనంతపురం) 
∙ఎం. గౌతమి (కలెక్టర్, అనంతపురం జిల్లా) 
∙కె. తిరుమలేశ్వరరెడ్డి (ఎస్పీ, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా) 
∙పి. పరమేశ్వర్‌రెడ్డి (ఎస్పీ, ప్రకాశం జిల్లా) 
∙వై. రవిశంకర్‌రెడ్డి (ఎస్పీ, పల్నాడు జిల్లా) 
∙రిశాంత్‌రెడ్డి (ఎస్పీ, ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధక విభాగం) 
∙వీర రాఘవరెడ్డి (డీఎస్పీ, అనంతపురం) 
∙సి. మహేశ్వర్‌రెడ్డి (సీఐ, పలమనేరు, చిత్తూరు జిల్లా) 
∙పి.జగన్‌మోహన్‌రెడ్డి (సీఐ, తిరుమల) 
∙జి. అమర్‌నాథ్‌రెడ్డి (సీఐ, తిరుమల) 

ఈసీ చార్జ్‌మెమో జారీ చేసిన అధికారులు 
∙కె. రఘువీరారెడ్డి (ఎస్పీ, నంద్యాల) 
∙ఎన్‌. రవీంద్రనాథ్‌రెడ్డి (డీఎస్పీ, నంద్యాల) 
∙కె. రాజారెడ్డి (సీఐ, నంద్యాల టూటౌన్‌) 

బదిలీ అయిన ఇతర ఓసీ సామాజికవర్గాల వారు 
∙పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు (డీజీ, ఇంటెలిజెన్స్‌) (బ్రాహ్మణ) 
∙ఆర్‌. వినోద్‌ (ఎస్సై, తిరుమల) (క్షత్రియ) 
∙ బీవీ శ్రీనివాసులు (ఎస్సై, తిరుమల), (బలిజ)

 
Advertisement
 
Advertisement