ఒకప్పటి తెలుగు హీరో జగపతిబాబు మోసపోయాడు. స్వయంగా తానే ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఇన్ స్టాలో ఇందుకు సంబంధించిన ఓ వీడియోని స్టోరీగా పోస్ట్ చేశాడు. తనని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసిందని అన్నాడు. కానీ ఆ సంస్థ పేరు మాత్రం త్వరలో చెబుతానని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.
(ఇదీ చదవండి: 'హనుమాన్' నటి వరలక్ష‍్మీ శరత్ కుమార్ పెళ్లి డేట్ ఫిక్సయిందా? ఎప్పుడంటే?)
జగపతిబాబు ఏం చెప్పాడు?
'రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో రీసెంట్‌గా హెచ్చరించారు. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్ యాడ్‌లో నేను నటించాను. అయితే నన్ను వాళ్లు మోసం చేశారు. వాళ్లు ఎవరు? అసలు ఏం జరిగింది? అనే వివరాలన్నీ త్వరలో చెబుతా. భూమి కొనే ముందు రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) రూల్స్ కచ్చితంగా తెలుసుకోండి' అని జగపతిబాబు చెప్పుకొచ్చాడు.
హీరోగా కొన్నేళ్ల పాటు అలరించిన జగపతిబాబు.. 'లెజెండ్' మూవీతో విలన్‌గా మారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అలా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేశాడు. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చాడు. ప్రస్తుతం 'మిస్టర్ బచ్చన్' మూవీ చేస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా తనని మోసం చేశారని చెప్పి షాకిచ్చాడు.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
Comments
Please login to add a commentAdd a comment