బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఖాతాదారులకు శుభవార్త! | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఖాతాదారులకు శుభవార్త!

Published Sat, Dec 30 2023 7:34 AM

Bank Of Baroda Raises Interest Rates On Fixed Deposits  - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 125 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది. బ్యాంకింగ్‌ దిగ్గజం– ఎస్‌బీఐ ఇటీవలే అరశాతం వడ్డీరేటు పెంచిన నేపథ్యంలోనే బీఓబీ తాజా నిర్ణయం తీసుకుంది.

1.25 శాతం వరకూ పెరిగిన వడ్డీరేటు డిసెంబర్‌ 29వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్‌ ప్రకటన పేర్కొంది. రుణ రేటు పెరుగుదల, నిధుల సమీకరణ అవసరాల నేపథ్యంలో కొన్ని బ్యాంకులు డిపాజిట్‌ రేటు పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది. తాజాగా బీఓబీ ఏడాది లోపు స్వల్పకాలిక కాలపరిమితులపై డిపాజిట్‌ రేట్ల పెంపుపై ప్రధానంగా బ్యాంక్‌ దృష్టి సారించింది.

బీఓబీ తాజా నిర్ణయం ప్రకారం... 

రూ.2 కోట్ల వరకూ వివిధ టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు 10 బేసిస్‌ పాయిట్ల నుంచి 125 బేసిస్‌ పాయింట్ల వరకూ పెరిగింది.  

7 నుంచి 14 రోజుల డిపాజిట్‌ రేట్లు అత్యధికంగా 3 శాతం నుంచి 1.25 % పెరిగి 4.25 శాతానికి చేరింది.  

15 నుంచి 45 రోజుల డిపాజిట్‌ రేటు 1 శాతం పెరిగి 4.50 శాతానికి చేరింది.  
 
         

Advertisement
 
Advertisement
 
Advertisement