అత్యాచార ఆరోపణలను ఖండించిన సజ్జన్ జిందాల్ | Sakshi
Sakshi News home page

అత్యాచార ఆరోపణలను ఖండించిన సజ్జన్ జిందాల్

Published Mon, Dec 18 2023 7:23 AM

False Baseless Sajjan Jindal On Rape Charge Against Him - Sakshi

ముంబై: తనపై నమోదైన అత్యాచార కేసుపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ స్పందించారు. ఆ ఆరోపణలు అవాస్తవమని, నిరాధారమని పేర్కన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న సజ్జన్‌ జిందాల్‌ కేసు విచారణ కొనసాగుతున్నందున దీనిపై మరింతగా వ్యాఖ్యానించలేనని వివరించారు.

సజ్జన్ జిందాల్‌పై 30 ఏళ్ల వైద్యురాలైన మహిళ ఈ ఆరోపణలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ముంబైలో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఫిర్యాదు చేసి చాలా నెలలు గడిచినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆ మహిళ ఆరోపించారు.

2021లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ సందర్భంగా దుబాయ్‌లో తాను సజ్జన్ జిందాల్‌ను కలిశానని ఆ మహిళ తెలిపారు. పెళ్లి చేసుకుంటానని సజ్జన్‌ జిందాల్ తనను నమ్మించాడని, 2022 జనవరి 24న తనపై అత్యాచారం చేశాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement