Ratan Tata's younger brother Jimmy Naval Tata lives in a 2bhk flat in Mumbai - Sakshi
Sakshi News home page

Jimmy Naval Tata: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్‌మెంట్‌లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..

Published Thu, Jun 8 2023 1:43 PM

Ratan tata brother jimmy naval tata live 2bhk flat in Mumbai - Sakshi

Ratan Tata Brother Jimmy Naval Tata: భారతీయ ఆటో మొబైల్ రంగానికి ఆజ్యం పోసిన టాటా కుటుంబం గురించి అందరికి తెలుసు. అయితే ఇప్పుడు టాటా గ్రూప్ అనగానే 'రతన్ టాటా' గుర్తుకు వస్తాడు. అయితే రతన్ టాటాకి వివాహం కాలేదు, కానీ తోబుట్టువులతో కూడిన ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో చెప్పుకోదగ్గ వ్యక్తి రతన్ టాటా తమ్ముడు 'జిమ్మీ నావల్ టాటా'.

రతన్ టాటా తమ్ముడంటే ఆయన మాదిరిగానే వ్యాపార లావాదేవీలు బాగా చూసుకునే వ్యాపార వేత్త, బిలీనియర్ అని ఊహిస్తారు. కానీ ఆలా ఊహిస్తే మీ ఊహ తప్పే అవుతుంది. ఎందుకంటే జిమ్మీ నావల్ టాటా వారి వ్యాపార సామ్రాజ్యానికి దూరంగా సాధారణ ప్రజలలో ఒకరుగా కలిసి జీవిస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆయన ముంబైలో ఒక 2BHK అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు సమాచారం.

జిమ్మీ నావల్ టాటా మీడియాకి దూరంగా ఉండటమే కాకూండా, వ్యాపారాలన్నింటికీ కూడా దూరంగా ఉంటూ చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు. నావల్ టాటా కుమారుడు, రతన్ టాటా తమ్ముడై ఉండి ఇలాంటి జీవితం గడుపుతున్న జిమ్మీ నావల్ టాటాను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. 

90వ దశకంలోనే జిమ్మీ నావల్ తన తండ్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన వస్త్ర వ్యాపారంలో వృత్తిని ప్రారంభించి, ఆ తరువాత అనేక టాటా ఆధ్వర్యంలో ఉన్న కంపెనీలలో పనిచేసి అనతి కాలంలోనే విరమణ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒక చిన్న ఫ్లాట్‌లో సామాన్యుడిలా జీవిస్తున్నాడు.

ఈ ఏడాది ప్రారంభంలో రతన్ టాటా తన తమ్ముడు జిమ్మీ టాటాతో కలిసి ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'అవి సంతోషకరమైన రోజులు, మా మధ్య ఏమి రాలేదు' అని ఇందులో రాసారు. ఆ ఫోటో 1945లో తీసుకున్నట్లు ఇందులో స్పష్టంగా తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. వారు చేసే బిజినెస్ ఏంటో తెలుసా?)

రతన్ టాటా ఆస్తులు సుమారు రూ. 3500 కోట్లకంటే ఎక్కువ. అయితే ఇప్పటి వరకు చాలా మందికి తెలియని జిమ్మీ నావల్ రతన్ టాటా కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు. ఎందుకు ఈయన వ్యాపారాల మీద ఆసక్తి చూపడం లేదు అనేదానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. బహుశా ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకోవడం వల్ల అన్నింటికీ దూరంగా ఉన్నాడని తెలుస్తుంది.

(ఇదీ చదవండి: అమెరికా వద్దు భారత్‌ ముద్దు.. 60 ఏళ్ల వయసులో 100 వ్యాపారాలు)

RGP ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయాంక్ గతంలో షేర్ చేసిన ఒక ట్విటర్ పోస్ట్‌లో జిమ్మీ టాటా ఒక చిన్న ఫ్లాట్‌లో ఉన్నారని, కుటుంబ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదని చెప్పారు. అంతే కాకుండా అతడు మంచి స్క్వాష్ ప్లేయర్ అని తనని (గోయెంకాను) ఎప్పుడూ ఓడించేవాడని చెప్పుకొచ్చాడు. కొన్ని వార్తా పత్రికలు అందించిన సమాచారం ప్రకారం.. జిమ్మీ టాటాకు మొబైల్ ఫోన్ లేదని, కేవలం వార్తాపత్రిక ద్వారా అతని అన్ని అప్‌డేట్‌లను పొందుతారని తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement