మద్యపాన వ్యసనానికి చెక్‌పెట్టే సరికొత్త చికిత్స విధానం! | Sakshi
Sakshi News home page

మద్యపాన వ్యసనానికి చెక్‌పెట్టే సరికొత్త చికిత్స విధానం! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు

Published Wed, Mar 6 2024 12:10 PM

Study Shows Promise Of Gene Therapy For Alcohol Use Disorder - Sakshi

మద్యపాన వ్యసనం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపింది. బంధాలను ముక్కలు చేసి ఎవర్నీ ఎవరికీ కాకుండా చేసి జీవితాలను కాలరాస్తోంది. అలాంటి మహమ్మారిలాంటి ఈ మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు సమర్థవంతమైన చికిత్స విధానాలు ఇప్పటివరకు అందుబాటుల్లో లేవు. డీ అడిక్షన్‌ సెంటర్లు ఉన్నాయి కదా! అని అంటారేమో. మందు బాబులు అక్కడ ఇచ్చే కౌన్సిలింగ్‌కి, జీవనశైలికి దాని అడిక్షన్‌ నుంచి బయటపడినట్లు అనిపిస్తారు అంతే. కళ్ల ముందు  చుక్క కనిపించిందంటే మళ్లీ కథ మాములే. కొందరే ఆయా సెంటర్ల నుంచి మెరుగై మళ్లీ దాని జోలికి వెళ్లకుండా ఉండేందుకు యత్నిస్తారు. ఇది కూడా అంత ప్రభావంతమయ్యింది కాదు. దీని పరిష్కారం కోసం ఎన్నాళ్లుగానే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా అధ్యయనాల్లో దీనికి ప్రభావంతమైన జన్యు చికిత్స విధానాన్ని కనుగొన్నారు. 

అదేంటంటే..ఈ ఆల్కాహాల్‌ యూజ్‌ డిజార్డర్‌(ఏయూడీ) ఓ పట్టాన వదిలించుకోలేని జబ్బు అని చెప్పొచ్చు. దీని కోసం శాస్త్రవేత్తలు చేసిని పరిశోధన కొంతవరకు పురోగతినే చూపించింది. ఈ మద్యపానానికి బానిసలుగా మారిన వాళ్ల బ్రెయిన్‌పై పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఎందుకు మందువైపు నుంచి వాళ్లను వాళ్లు మరల్చుకోలేకపోవడానికి కారణం ఏంటా? అనే దిశగా పరిశోధనలు చేయగా..మెదడులో ఉండే కమ్యేనికేషన్‌ వ్యవస్థకు సంబంధించిన మొసోలింబిక్‌ డోపమేన్‌ సిగ్నలింగ్‌ లోతుగా ఉన్నట్లు గురించారు. ఇది మద్యం సేవిస్తే కలిగి మంచి అనుభూతిని న్యూరోట్రాన్సిమీటర్‌కు ఎలా ప్రశారం చేస్తుందో నిర్థారించారు.

ఈ వ్యవస్థ పనితీరులో ప్రధానమైనది గ్లియల్‌ డెరైవ్డ్‌ న్యూరోట్రోఫిక్‌ ఫ్యాక్టర్‌(జీడీఎన్‌ఎఫ్‌) అనే ప్రోటీన్‌. అల్కహాల్‌ తాగకుండా ఉండేందుకు యత్నిస్తున్న ఏయూడీ రోగుల మెదుడులోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (వీటీఏ) జీడీఎన్‌ఎఫ్‌స్థాయిలు పడిపోతాయని పరిశోధనలో తేలింది. దీని కోసం జన్యు చికిత్స ఉపయోగించి వీటీఏలో జీడీఎన్‌ఎఫ్‌ స్థాయిలను భర్తీ చేస్తే డోపమేన్‌ సిగ్నలింగ్‌ను బలోపేతం అవుతుందా? అనే దిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఆ అధ్యయనంలో తక్కువ మోతాదులో మద్యపానం సేవిస్తే డోపమైన్‌ సిగ్నలింగ్‌ విడుదల బాగానే ఉంది. దీర్ఘకాలికంగా తాగితే మాత్రం మెదడును డీసెన్సిటైజ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత కాలక్రమేణ తక్కువ డోపమైన్‌ను విడుదల చేస్తుందని అన్నారు.

ఈ వ్యసనంతో బాధపడుతున్నవారికి నిగ్రహంగా ఉందామనే సమయంలో వచ్చే అసౌకర్యం, చికాకుని తట్టుకోలే మళ్లీ తాగడం ప్రారంభిస్తుంటారని అన్నారు. ఇక్కడ తాగాలనిపించేలా మెదడు సిగ్నలింగ్‌ ఇచ్చే డోపమేన్‌ వ్యవస్థకే జన్యు చికిత్స చేస్తే సమస్యను అధిగమించవచ్చు అనేది శాస్త్రవేతల ఆలోచన. అందుకోసమని కొన్ని కోతులపై ఈ పరిశోధన చేశారు. దాదాపు 21 రోజుల పాటు కోతులకు మద్యపానం, నీరు వాటికి నచ్చినంత తాగేలా స్వేచ్ఛగా వదిలేశారు. కొద్దిరోజులకే అవి అధికంగా మధ్యపానానికి అడిక్ట్‌ అవ్వడం చూశారు. ఆ తర్వాత ఆ కోతులకు జీడీఎన్‌ఎఫ్‌ జన్యు చికిత్సను అందించారు.

దీంతో అవి మద్యపానానికి బదులు నీటిని తాగడానికి ప్రయత్నించడం మొదలు పెట్టాయి. తెలియకుండానే మద్యపానాన్ని పక్కనపెట్టడం జరిగింది. వాటి రక్తంలో ఆల్కహాల్‌ కంటెంట్‌ తక్కువుగా ఉండటాన్ని కూడా గుర్తించారు. ఆల్కహాల్‌ యూస్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నవారికి ఈ చికిత్స గొప్ప పరిష్కార మార్గం అని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారని, వారికి ఈ చికిత్స విధానం అద్భుత ప్రయోజనాలను ఇవ్వగలదని అన్నారు. అయితే ప్రభావవంతంగా పనిచేస్తున్న ఈ జన్యు చికిత్స మానువులకు ఎంతవరకు సురక్షితం అనేదాని గురించి ట్రయల్స్‌ నిర్వహించి మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

(చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడకల్లో 'ఇడ్లీ లొల్లి'..దీని మూలం ఎక్కడిదంటే..)
 

Advertisement
Advertisement