పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు | Sakshi
Sakshi News home page

మధురానగర్‌: పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు

Published Thu, May 16 2024 9:08 AM

2 Families Get into a Fight over a Dog

వెంగళరావునగర్: పెంపుడు కుక్క అరచిందని పెద్ద గొడవే జరిగింది. ఓ కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చి చితకబాదారు కొందరు. తన తమ్ముడితో పాటు మరదలును, కుక్కను హత్య చేయబోయారంటూ ఓ వ్యక్తి మధురానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రహమత్ నగర్ లో  నివాసం ఉండే ఎన్. శ్రీనాధ్, అతని భార్య స్వప్నలు ఈ నెల 8వ తేదీనాడు ఉదయం పోస్టల్ బ్యాలెట్ వేయడానికి తన పెంపుడు కుక్కతో పాటు ఇంటి నుంచి బయలుదేరాడు. అదే సమయంలో ఇంటి పక్కన ఉన్న వ్యక్తి వారి కుక్క రోడ్డుపై ఉన్నారు. ఆ సమయంలో వీరి కుక్క వారిని చూసి మొరిగింది. దాంతో ధనుంజయ్ అనే వ్యక్తి భార్య భర్తలను దుర్భాషలాడాడు. 

ఈ విషయంపై నాడు మధురానగర్ పీఎస్ లో    ఫిర్యాదు చేశారు. తిరిగి ఈ నెల 14వ తేదీ సాయంత్రం శ్రీనాధ్  కుక్కతో బయటకు రాగా ధనుంజయ్ అనే వ్యక్తితో పాటు నలుగురు వ్యక్తులు వచ్చి శ్రీనాధ్ ను, అతని భార్య స్వప్నతో పాటుగా మేనల్లుడు, కోడలును, కుక్కను సైతం చంపుతామని బెదిరిస్తూ తీవ్రంగా కర్రలతో, రాడ్లతో కొట్టారు. దాంతో శ్రీనాథ్ అపస్మారకస్థితికి వెళ్లాడు. మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో శ్రీనాథ్ సోదరుడు ఎన్.మధు మధురానగర్ పీఎస్ లో  ఎల్. మధుతో పాటు మరో నలుగురిపై హత్యయత్నం కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement