కుక్కను ఎత్తుకెళ్లాడని బోనులో బంధించి.. | Sakshi
Sakshi News home page

కుక్కను ఎత్తుకెళ్లాడని బోనులో బంధించి..

Published Wed, Feb 21 2024 1:08 AM

- - Sakshi

సాక్షి, బళ్లారి: తాగిన మైకంలో ఓ వ్యక్తి బార్‌లో యజమానికి చెందిన కుక్కను పట్టుకెళ్లాడు, దాంతో బార్‌ సిబ్బంది ఆ మందుబాబుని తీసుకొచ్చి కుక్కను ఉంచిన బోనులోనే బంధించారు. ఈ అమానుష ఘటన విజయపుర నగరంలోని బబలేశ్వర రోడ్డులోని సాయి ప్రభాత్‌ బార్‌లో జరిగింది. వివరాలు.. సోము అనే వ్యక్తి బార్‌లో మద్యం తాగాడు, అక్కడే ఉన్న కుక్కను పట్టుకెళ్లాడు.

సిబ్బంది గాలించి సోమును బార్‌కు లాక్కొచ్చి కొట్టి బోనులో బంధించారు. కుక్క ముద్దుగా ఉండటంతో మద్యం మత్తులో తీసుకెళ్లానని, వదిలిపెట్టాలని బాధితుడు మొర పెట్టుకున్నా వారు కనికరించలేదు. స్థానికులు, బార్‌కు వచ్చినవారు గొడవ చేయడంతో చివరకు అతన్ని విముక్తున్ని చేశారు. బార్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement