Yadadri: ఇంజెక్షన్‌ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి | 6YearOld Yadadri Boy Needed ₹ 16 Crore Injection | Sakshi
Sakshi News home page

యాదాద్రి చిన్నారికి కష్టం: ఇంజెక్షన్‌ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి

Published Thu, May 16 2024 7:57 AM | Last Updated on Thu, May 16 2024 8:30 AM

6YearOld Yadadri Boy Needed ₹ 16 Crore Injection

6 నెలల చిన్నారికి ప్రాణాంతక జబ్బు..

 అమెరికాలో దొరికే ఇంజెక్షన్‌ ఖరీదు రూ.16 కోట్లు

రూ.10 కోట్లు సమకూర్చిన విదేశీ దాతలు 

సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి

సాక్షి, యాదాద్రి : ఆరు నెలల బాబుకు అలవికాని జబ్బు వచ్చింది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న చిన్నారి వైద్యానికి రూ.16 కోట్లు అవసరం కాగా, విదేశాల నుంచి రూ.10 కోట్లు దాతల విరాళాలు అందాయి. మిగతా రూ.6 కోట్లు మన దేశంలోనే సమకూర్చుకోవాలని చెప్పడంతో ప్రభుత్వం, దాతలు సహకరించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 

వివరాల్లోకి వెళితే..యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన కొలను దిలీప్‌రెడ్డి–యామిని దంపతులకు ఆరు నెలల వయస్సున్న భవిక్‌రెడ్డి స్పైనల్‌ మస్కలర్‌ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు. లక్షల్లో ఒక్కరికి వచ్చే అత్యంత ప్రాణాంతకమైన జబ్బుగా పరీక్షల్లో డాక్టర్లు గుర్తించారు. భవిక్‌రెడ్డికి నరాల కండరాల బలహీనత ఎస్‌ఎమ్‌ఏ టైప్‌ –1 హైరిస్క్‌గా డాక్టర్లు నిర్ధారించారు. వ్యాధిని నయం చేసే ఇంజెక్షన్‌ ఇవ్వకపోతే చనిపోతాడని డాక్టర్లు అంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. 

కాగా అమెరికాలో లభించే ఈ ఇంజెక్షన్‌ ధర రూ.16 కోట్లు అని వైద్యం చేస్తున్న హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ రమేశ్‌ కోణంకి పర్యవేక్షణలో బాబుకు వైద్యం జరుగుతోంది. రెయిన్‌బో ఆస్పత్రి సౌజన్యంతోనే విదేశాల నుంచి సుమారు రూ.10 కోట్ల విరాళాలు ఇప్పటికే సేకరించారు. మరో రూ.6 కోట్లు ఇక్కడే సమకూర్చుకోవాలని వైద్యులు చెప్పారు. 

తమ చిన్నారి ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లిదండ్రులు దాతల సహకారం కోరుతున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే కోసం : 9640160506, అకౌంట్‌ హోల్డర్‌ పేరు : కొలను దిలీప్‌రెడ్డి ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ : ఎస్‌బీఐఎన్‌0021766, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ : 42380569990 బ్యాంకు బ్రాంచ్‌: ఎస్‌బీఐ వలిగొండ.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement