చిన్నారికి ‘డికాంపెన్సటేడ్ లివర్ డిసీజ్’
వైద్య ఖర్చుల కోసంరూ.22 లక్షలు అవసరం
కూలి పనికి వెళ్తేనే పూటగడిచే స్థితిలో తల్లిదండ్రులు.. దాతల సాయం కోసం ఎదురుచూపు
టేకుమట్ల: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. తండ్రి ఆటోడ్రైవర్, తల్లి దినసరి కూలీగా పని చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసుకుంటున్నారు. ఉన్నట్టుండి వారి కూతురు అనారోగ్యం పాలవడంతో ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించగా పెద్దరోగం వచి్చందని డాక్టర్లు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన దండ్రె రమేశ్, కవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు.
చిన్న కూతురు మహాలక్ష్మి నెల రోజుల క్రితం అనారోగ్యం పాలవడంతో వివిధ ఆస్పత్రులకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు. చివరకు ఆ బాలికకు ‘డికాంపెన్సటేడ్ లివర్ డిసీజ్’అని డాక్టర్లు తేల్చడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించి చికిత్సనందిస్తున్నారు.
ప్రస్తుతం పాప ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే అందినకాడ అప్పు చేసి వైద్యం చేయించారు. ఇంకా రూ.22 లక్షల మేర ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలపడంతో ఆ తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కూలీ పని చేసుకుని జీవించే తమ బతుకుల్లో పెద్దకష్టం వచి్చందని, పాపకు వైద్యం చేయించేందుకు దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేసేవారు ఈ నంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని (97013 29434) కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment