Today Horoscope: ఈ రాశి వారికి ఇంటిలో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. | Daily Horoscope: Rasi Phalalu 16-05-2024 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశి వారికి ఇంటిలో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Published Thu, May 16 2024 6:27 AM | Last Updated on Thu, May 16 2024 8:35 AM

Daily Horoscope: Rasi Phalalu 16-05-2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.అష్టమి ఉ.7.22 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: మఖ రా.7.12 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ఉ.6.06 నుండి 7.50 వరకు, తదుపరి తె.4.02 నుండి 5.46 వరకు(తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం: ఉ.9.47 నుండి 10.35 వరకు, తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: సా.4.31 నుండి 5.56 వరకు. 

మేషం: ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు.

వృషభం: దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కార్యక్రమాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు.

మిథునం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తిలాభ సూచనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి.

కర్కాటకం: దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.

సింహం: నూతన విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య : రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు  మందగిస్తాయి.

తుల: ఇంటిలో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

వృశ్చికం: కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. సన్మానాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి చికాకులు.

మకరం: ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కుంభం: కొత్త  విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

మీనం: ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement