ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు దక్కుతాయి | Today Telugu Horoscope On October 30th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు దక్కుతాయి

Published Wed, Oct 30 2024 6:20 AM | Last Updated on Wed, Oct 30 2024 9:35 AM

Daily horoscope october 30 telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.త్రయోదశి ప.12.39 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: హస్త రా.10.04 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.23 నుండి 12.11, వరకు, అమృత ఘడియలు: ప.3.21 నుండి 5.08 వరకు, మాసశివరాత్రి; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.01, సూర్యాస్తమయం: 5.27. 

మేషం: ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. బంధువుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యవహారాలలో ఆటంకాలు. సన్నిహితులతో తగాదాలు. దూరప్రయాణాలు.  ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మిథునం: కుటుంబంలో చికాకులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగావకాశాలు చేజారవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం. బంధువులతో తగాదాలు.

కర్కాటకం: ఆకస్మిక ధనలాభం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. పనులు ముందుకు సాగవు.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

కన్య: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. సన్మానాలు, పురస్కారాలు అందుకుంటారు.

తుల: అనుకోని సంఘటనలు. దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి.వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. బంధువులతో అకారణంగా తగాదాలు.

వృశ్చికం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు పొందుతారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోతాహకరం.

ధనుస్సు: నూతన ఉద్యోగాలలో చేరతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. సోదరుల కలయిక. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మకరం: ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం.  వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. విద్యార్థులకు ఒత్తిడులు.

కుంభం: ఆర్తిక ఇబ్బందులు. ప్రయాణాలలో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

మీనం: కాంట్రాక్టులు పొందుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement