ఈ రాశి వారికి పాత బాకీలు వసూలు, ఆకస్మిక వస్తు లాభం | Today Telugu Horoscope On October 18th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి పాత బాకీలు వసూలు, ఆకస్మిక వస్తు లాభం

Published Fri, Oct 18 2024 6:51 AM | Last Updated on Fri, Oct 18 2024 8:48 AM

Horoscope Today Rasi Phalalu October 18 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.పాడ్యమి ప.3.01 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: అశ్వని సా.4.01 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ప.12.19 నుండి 1.47 వరకు, తదుపరి రా.1.02 నుండి 2.30 వరకు, 

దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.10 నుండి 12.58 వరకు, 
అమృత ఘడియలు: ఉ.9.17 నుండి 10.46 వరకు; 
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, 
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, 
సూర్యోదయం: 5.56, సూర్యాస్తమయం: 5.34. 

 

మేషం: ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. నూతన ఉద్యోగాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృషభం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

మిథునం: కుటుంబంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం నుండి విముక్తి.

కర్కాటకం: గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం: రాబడి కొంత నిరాశ కలిగిస్తుంది. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

కన్య: రుణయత్నాలు. పనులు ముందుకు సాగవు. బంధువుల కలయిక. ఆరోగ్యసమస్యలు. శ్రమ మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

తుల: కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కీలక సమాచారం.

వృశ్చికం: సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. విందువినోదాలు. ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు.

ధనుస్సు: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశాజనకంగా ఉంటుంది.

మకరం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

కుంభం: నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. పాతమిత్రుల కలయిక. ధనలాభం. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.

మీనం: శ్రమానంతరం పనులు పూర్తి. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపారస్తులకు నిరాశ. ఉద్యోగులు ఇబ్బందులు పడతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement