ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు, సంఘంలో గౌరవం | Daily Horoscope 19 October 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు, సంఘంలో గౌరవం

Published Sat, Oct 19 2024 6:44 AM | Last Updated on Sat, Oct 19 2024 8:54 AM

Daily Horoscope 19 October 2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: బ.విదియ ప.12.47 వరకు తదుపరి తదియ, నక్షత్రం: భరణి ప.2.31 వరకుతదుపరి కృత్తిక, వర్జ్యం: రా.1.54 నుండి 3.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.46 నుండి 7.32 వరకు, అమృతఘడియలు: ఉ.10.01 నుండి 12.28 వరకు, అట్లతదియ. 

మేషం: కుటుంబంలో శుభకార్యాలు. దైవచింతన. ఆర్థిక లాభాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మరింత సానుకూలత.

వృషభం: ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

మిథునం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కర్కాటకం: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు. నూతన ఉద్యోగలాభం. సోదరులు, మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

సింహం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య: పనులు మధ్యలో వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం.  మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. నూతన వ్యక్తుల పరిచయం. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. .

ధనుస్సు: .ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. సోదరులతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం: ధన, వస్తులాభాలు. పనులు సజావుగా పూర్తి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మీనం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement