ఈ రాశివారికి కొత్త వ్యక్తులతో పరిచయం, శుభవార్తలు వింటారు..! | Today Telugu Horoscope On October 20th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి కొత్త వ్యక్తులతో పరిచయం, శుభవార్తలు వింటారు..!

Published Sun, Oct 20 2024 6:51 AM | Last Updated on Sun, Oct 20 2024 8:44 AM

Daily Horoscope 20 October 2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.తదియ ఉ.10.44 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: కృత్తిక ప.1.14 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: తె.4.34 నుండి 6.02 వరకు (తెల్లవారితే సోమవారం), దుర్ముహూర్తం: సా.4.03 నుండి 4.51 వరకు, అమృతఘడియలు: ఉ.10.56 నుండి 12.06 వరకు. 

సూర్యోదయం        :  5.57
సూర్యాస్తమయం    :  5.34
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. అనారోగ్యం.దూరప్రయాణాలు.

వృషభం: ఇంటాబయటా ప్రోత్సాహకరం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. భూవివాదాల పరిష్కారం.

మిథునం: దూరప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి  చికాకులు. అనారోగ్యం. పనులు నిదానంగా సాగుతాయి. నిర్ణయాలు వాయిదా వేస్తారు.  వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సోదరులతో సఖ్యత. ఆసక్తికర సమాచారం అందుతుంది. ఆహ్వానాలు రాగలవు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు..

సింహం: పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. రావలసిన సొమ్ము అందుతుంది. విందువినోదాలు. కొత్త ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. దైవదర్శనాలు.

కన్య: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. శ్రమాధిక్యం.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. ముఖ్యమైన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి..

వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు దక్కుతాయి..

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. ఆలయ దర్శనాలు.

మకరం: పనుల్లో కొంత జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. బంధుమిత్రులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో  ఇబ్బందులు. విద్యార్థులకు నిరాశ..

కుంభం: కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ముఖ్య వ్యవహారాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. శ్రమాధిక్యం.

మీనం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం .కళాకారులకు అంచనాలు నిజం కాగలవు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement