శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: పౌర్ణమి సా.5.23 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: రేవతి సా.5.39 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: ఉ.6.31 నుండి 7.59 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.31 నుండి 3.19 వరకు, అమృతఘడియలు: ప.3.50 నుండి 4.47 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.56, సూర్యాస్తమయం: 5.35.
మేషం: పనుల్లో అనుకోని జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని పనులు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోబివృద్ధి.
మిథునం: సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో వివాదాలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆలయ దర్శనాలు. ధనప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిని విధంగా ఉంటాయి.
కర్కాటకం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.
సింహం: ఆర్థిక లావాదేవీలు కాస్త నిరాశ కలిగిస్తాయి. బాధ్యతలు మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.
కన్య: ఆకస్మిక ధన, వస్తులాభాలు. అప్రయత్న కార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
తుల: వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనప్రాప్తి. స్థిరాస్తివృద్ధి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కొత్త నిర్ణయాలు. వ్యాపారాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృశ్చికం: మిత్రులతో అకారణంగా వివాదాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.
ధనుస్సు: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
మకరం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కుంభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలు ముందుకు సాగవు.
మీనం: ఒక సమాచారం ఊరటనిస్తుంది. బంధువుల ద్వారా ధనలాభం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు.
Comments
Please login to add a commentAdd a comment