శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.దశమి ఉ.7.22 వరకు, తదుపరి ఏకాదశి,
నక్షత్రం: మఖ ప.3.01 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.11.42 నుండి 1.26 వరకు, దుర్ముహూర్తం: సా.4.00 నుండి 4.48 వరకు, అమృతఘడియలు: ప.12.23 నుండి 2.06 వరకు.
సూర్యోదయం : 5.59
సూర్యాస్తమయం : 5.29
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: సన్నిహితులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాల విస్తరణ లో చికాకులు. ఉద్యోగమార్పులు.
వృషభం: అనుకోని ప్రయాణాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో విరోధాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మిథునం: ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.విలువైన వస్తువులు కొంటారు. భూవివాదాలు పరిష్కారం. కీలక నిర్ణయాలు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కర్కాటకం: కుటుంబంలో చికాకులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. నూతన ఉద్యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
కన్య: పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
తుల: పరిచయాలు విస్తృతమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
వృశ్చికం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
ధనుస్సు: శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళపెట్టవచ్చు.
మకరం: బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కుంభం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్యనిర్ణయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
Comments
Please login to add a commentAdd a comment