ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనం, శుభవార్తలు వినే అవకాశం | Today Telugu Horoscope On October 29th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనం, శుభవార్తలు వినే అవకాశం

Published Tue, Oct 29 2024 7:39 AM | Last Updated on Tue, Oct 29 2024 8:54 AM

Daily horoscope october 29 telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.ద్వాదశి ఉ.10.36 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఉత్తర రా.7.28 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: తె.4.47
నుండి 6.31 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.06 వరకు, తదుపరి రా.10.31 నుండి 11.19 వరకు, అమృతఘడియలు: ఉ.10.29 నుండి 1.16 వరకు, ధన త్రయోదశి

మేష రాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  భవిష్యత్‌ ప్రణాళికలపై దృష్టిసారిస్తారు. విషయాలను జాగ్రత్తగా ఉంచండి. బంధువులతో షేర్‌ చేసుకోవద్దు.

వృషభం: మీ కుటుంబ ఆరోగ్య విషయం జాగ్రత్తగా అవసరం. సోదరులతో వివాదాలు ఉంటే అది ఈరోజు పరిష్కారం కావొచ్చు. బంధువులకు ఇచ్చిన డబ్బు తిరిగే పొందే అవకాశం.

మిధునం: మీ నుండి కొన్ని పనులు చేజారిపోయే అవకాశం ఉంది. దానివల్ల నిరాశ కల్గవచ్చు. అప్పు చేసే విషయంలో జాగ్రత్గా అవసరం. ఉద్యోగంలో సమస్యలు ఏర్పడే అవకాశం. సహోద్యోగుల నుంచి సహాయం లభించే అవకాశం.

కర్కాటకం:  ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం. మరోవైపు పిల్లల చదువుల విషయంలో కొన్ని సమస్యలు తీరే అవకాశం. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి అనుకూలం.

సింహం:  జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు జాగ్రత్త అవసరం.  నోరు జారకుండా ఉంటే మంచిది.  కుటుంబ సభ్యుల నుంచి కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

కన్య:  ఉద్యోగస్తులు జాగ్రత్త అవసరం. శత్రువుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలం.

తుల:  ఈరోజు అన్నింటా విజయం మీదేగా ఉంటుంది.  సహోద్యోగులలో ఒకరి నుంచి వ్యతిరేక ఎదుర్కొనే అవకాశం. తల్లిదండ్రుల మద్దతుతో విద్యార్థులు ఉన్నత విద్యకు మార్గం సుగమం చేసుకునే అవకాశం

వృశ్చికం: పెండింగ్‌లో ఉన్న ఇంటి పనులు పూర్తయ్యే అవకాశం. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వ్యాపార ప్రణాళికలను ఎవరితోనూ షేర్‌ చేసుకోవద్దు. వ్యాపార విషయంలో రిస్క్‌ చేయకుండా ఉండటమే మంచిది

ధనస్సు: ఈరోజు సానుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిపట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది.  పాత స్నేహితుడిని కలిసే అవకాశం. రుణాలు ఇవ్వకుండా ఉంటే మంచిది.

మకరం: భవిష్యత్తు ప్రణాళికకు ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం.  తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం. శుభవార్త వినే అవకాశం. వివాదాలకు దూరంగా ఉండండి.

కుంభం:  ఉద్యోగులకు మంచి రోజు. ప్రమోషన్స్‌ వచ్చే అవకాశం.  శత్రువుల నుంచి దూరంగా ఉంటే మంచింది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా అవసరం. వృథా ఖర్చుల జోలికి వెళ్తే మానసిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం.

మీనం:  వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకూలం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో వాగ్వాదాలకు దూరంగా ఉండండి. డబ్బు విషయంలో ఎవరితోనూ వివాదాలకు దిగకుంటే ఉంటే మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement