గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: శు.విదియ రా.3.34 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.1.18 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.9.15 నుండి 10.51 వరకు, తదుపరి తె.5.15 నుండి 6.47 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ఉ.11.44 నుండి 12.32 వరకు, అమృతఘడియలు: సా.6.41 నుండి 8.17 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.34, సూర్యాస్తమయం: 5.32.
మేషం...రాబడికి మించిన ఖర్చులు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారులకు లాభాలు కనిపించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
వృషభం....కుటుంబసభ్యులతో తగాదాలు. కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయం అంతగా ఉండదు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
మిథునం....రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపారులు మరింత లాభపడతారు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి.
కర్కాటకం...బాకీలు వసూలవుతాయి. కార్యజయం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. కళాకారులకు ప్రోత్సాహం.
సింహం....కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అరోగ్యసమస్యలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
కన్య....కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు చికాకులు.
తుల....అప్పులు తీరుస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు చికాకులు. కళాకారులకు గందరగోళంగా ఉంటుంది.
వృశ్చికం....కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు ఒత్తిళ్లు.
ధనుస్సు..కార్యక్రమాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారులకు ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులు అనుకున్న హోదాలు దక్కించుకుంటారు.
మకరం.....కార్యక్రమాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు పనిభారం.
కుంభం....కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగుల సేవలకు గుర్తింపు రాగలదు.
మీనం...ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి..
Comments
Please login to add a commentAdd a comment