వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా విజయరాజు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా విజయరాజు

Published Tue, Apr 23 2024 8:20 AM

-

పట్నంబజారు: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి విజయరాజును నియమిస్తూ సోమవారం ఆదేశాలు వెలువడ్డాయి. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయరాజు తాడికొండ నియోజకవర్గానికి చెందిన నాయకులు.

టీడీపీ అభ్యర్థులపై కేసు నమోదు

గుంటూరు ఈస్ట్‌: టీడీపీ అభ్యర్థుల నామినేషన్‌ ర్యాలీలో అనుమతి లేకుండా పార్టీ బ్యానర్‌ కట్టి ప్యారాచుట్‌ ఎగురవేసిన ఘటనపై కేసు నమోదు చేశారు. పట్టాభిపురం పోలీసులు తెలిపిన వివరాలు.. టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్లా మాధవి, పార్లమెంట్‌ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ నామినేషన్‌ వేసేందుకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అనుమతి లేకుండా పార్టీ బ్యానర్‌ కట్టిన ప్యారాచుట్‌ ఎగురవేశారు. దీనిపై ఎంసీసీ టీమ్‌ ఇన్‌చార్జి శంకరాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement