కూటమి చర్యలు అనైతికం | Vijaya sai Reddy comments over tdp janasena and bjp | Sakshi
Sakshi News home page

కూటమి చర్యలు అనైతికం

Published Thu, May 9 2024 5:35 AM | Last Updated on Thu, May 9 2024 5:35 AM

Vijaya sai Reddy comments over tdp janasena and bjp

కొందరు బీఎల్‌ఓలు నిబంధనలు ఉల్లంఘించారు 

ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం 

నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి 

నెల్లూరు (దర్గామిట్ట): కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల వేళ అక్రమాలకు పాల్పడుతున్నాయని నెల్లూరు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియలో కొందరు కూటమి పార్టీ నాయకులు పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు.

టీడీపీ సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ అనుచరుడు పట్టాభిరామిరెడ్డి లాంటి వ్యక్తులు పోలింగ్‌ జరిగే చోటుకు వెళ్లారని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో కొందరు బీఎల్‌ఓలు నిబంధనల్ని ఉల్లంఘించారని తెలిపారు. కొందరు అధికారులు కూటమికి కొమ్ము కాస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రిటరి్నంగ్‌ అధికారి వికాస్‌ మర్మత్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేశామని చెప్పారు. ఏడుగురు సిబ్బందిపై ఫిర్యాదు చేస్తే ఒకరి మీద చర్య తీసుకున్నారని ఆయన వెల్లడించారు. 

ఈ ఎన్నికల్లో అక్రమాలకు కొమ్ముకాస్తున్న అధికారులపై ఆధారాలను సేకరిస్తున్నామన్నారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, రూప్‌కుమార్‌ యాదవ్‌ రౌడీలని.. వీరికి కొందరు పోలీసులు కొమ్ము కాస్తున్నారని చెప్పా­రు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఆయనకు తనవంతు సాయం అందిస్తున్నారన్నారు.  

డబ్బులతో గెలవచ్చనుకుంటున్నారు 
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు డబ్బున్న వాళ్లకే టిక్కెట్లు ఇచ్చారని మండిపడ్డారు. డబ్బులతో గెలవ వచ్చని వాళ్లు భావిస్తున్నారన్నారు. ఓటుకు రూ.5 వేలు ఇచ్చి దాంతో గెలుస్తానని నారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల కోసం 1,200 మంది రౌడీలను, నారాయణ సిబ్బంది, విజయవాడ, హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement