ఈ దారి.. వేల ఏళ్ల రహదారి.. యూరప్‌ మొట్టమొదటి సూపర్‌ హైవే | Italy: Road With A History Of More Than 2,000 Years - Sakshi
Sakshi News home page

ఈ దారి.. వేల ఏళ్ల రహదారి.. యూరప్‌ మొట్టమొదటి సూపర్‌ హైవే

Published Wed, Sep 6 2023 7:40 AM

Italy: Road With A History Of More Than Two Thousand Years - Sakshi

సాక్షి, ఏపీ సెంట్రల్‌ డెస్క్‌: ఈ రోడ్డును చూశారా.. స్ట్రెయిట్‌గా భలే ఉంది కదా! చూస్తుంటే ఇదేదో పాత రోడ్డు అని కూడా అనిపిస్తోంది కదా.. నిజమే ఈ రోడ్డుకు రెండు వేల ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 312లో ఈ రోడ్డును అప్పటి రోమన్‌ సామ్రాజ్య అధినేతలు నిర్మించారు.

ఇటలీ ఆగ్నేయ ప్రాంతం బ్రిండిసీ నుంచి 400 మైళ్ల దూరంలోని ప్రధాన నగరం రోమ్‌ను కలుపుతూ నిర్మించిన రోడ్డు ఇది. అప్పియన్‌ వేగా పిలిచే ఈ రోడ్డును రాజనీతిజ్ఞుడు అప్పియస్‌ క్లాడియస్‌ సీజస్‌ పేరుపై నిర్మించారు.

దక్షిణ ఇటలీని వశం చేసుకోవడం కోసం మిలిటరీని తరలించడానికి, అలాగే గ్రీస్, ఈజిప్టుకు నౌకాయానం కోసం అప్పటి రోమ్‌ పాలకులు దీనిని నిర్మిం​చారని చరిత్రకారులు చెబుతున్నారు. దీనిని యూరప్‌ మొట్టమొదటి సూపర్‌ హైవేగా కూడా చెబుతారు.
చదవండి: జపాన్‌లో టీచర్స్‌ డే ఎలా జరుపుకుంటారో తెలుసా!

Advertisement
 
Advertisement
 
Advertisement