‘భారత్‌తో మొండి వైఖరి మార్చుకోండి’ | Sakshi
Sakshi News home page

Repair Ties with India: ‘భారత్‌తో మొండి వైఖరి మార్చుకోండి’

Published Mon, Mar 25 2024 3:58 PM

Maldives Ex President says Muizzu Stop Being Stubborn India Ties - Sakshi

మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు తను వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ హితవు పలికారు. మొండిగా వ్యవహరించటం మానేసి.. దేశ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొటంలో పొరుగుదేశం భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్నారు. అయితే ఇటీవల మహ్మద్‌ మొయిజ్జు భారత్‌ విషయంలో సర్వం మార్చి.. భారత్ తమకు ఎప్పటి నుంచి సన్నిహిత మిత్ర దేశంగా కొనసాగుతుందని పేర్కొన్న విషయంలో తెలిసిందే. భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్‌ డాలర్లు బకాయిపడింది. అయితే దానిని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కల్పిలచాలని మాల్దీవుల కోరిన  విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మహమ్మద్‌ సోలిహ్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. మాలెలో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న మహమ్మద్‌ సోలిహ్‌ మాట్లాడారు. బాకాయిపడ్డ రుణంలో ఉపశమనం కల్పించాలని అధ్యక్షుడు మొయిజ్జు భారత్‌ను కోరినట్లు తాను మీడియాలో చేశానని తెలిపారు. భారత్‌తో బాకిపడ్డ మొత్తం కంటే చైనాతో బాకిపడ్డ రుణం ఎక్కువని అన్నారు. 

‘పొరుగు  దేశాలు సాయం చేస్తాయని నేను విశ్వసిస్తున్నా. మనం మొండితనం వదిలి, చర్చలు జరపాలి. దేశంలోని అ‍న్ని పార్టీలు సహకరిస్తాయి. అధ్యక్షుడు మొయిజ్జు ఎట్టిపరిస్థితుల్లో మొండితనంతో వెనకడుగు వేయోద్దు. ప్రభుత్వానికి ఇప్పడు దేశం ఎదుర్కొంటున్న పరిస్థితి అర్థం అయినట్లు తెలుస్తోంది’ అని మాజీ అధ్యక్షుడు  మహమ్మద్ సోలిహ్ తెలిపారు. 

తమ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.  చైనా అనుకూల వ్యక్తిగా గుర్తింపు ఉన్న  అధ్యక్షుడు  మొయిజ్జు గతేడాది మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌ సైన్యం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement