కిక్కిరిసిన వరాహ పుష్కరిణి | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన వరాహ పుష్కరిణి

Published Fri, May 24 2024 12:45 AM

కిక్క

వైశాఖ పౌర్ణమికి పోటెత్తిన భక్తులు

తరలివచ్చిన గరిడి బృందాలు

సింహాచలం : వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం సింహగిరికి భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా కొలిచే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు, గ్రామీణ ప్రాంతాల భక్తులు, ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము ఒంటి గంట నుంచే కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. స్వామివారి ప్రతిరూపాలుగా వెంట తీసుకొచ్చిన కోలలకు పూజలు నిర్వహించారు. వంటలు వండుకుని సహపంక్తి భోజనాలు చేశారు. మెట్లమార్గం ద్వారా సింహగిరికి నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. గరిడి వాయిద్యాలతో స్వామిని కీర్తించారు. స్నానమాచరించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో వరాహ పుష్కరిణి కిక్కిరిసింది. వంటలు వండుకుని, సహపంక్తి భోజనాలు చేసే భక్తులతో అడవివరం ప్రాంతంలోని సంత ప్రాంగణం, ప్రియాగార్డెన్స్‌, హవేళి ప్రాంగణం, పాత అడవివరంలోని మామిడి తోటలు నిండుకున్నాయి. మార్కెట్‌ కూడలి నుంచి వరాహ పుష్కరిణికి వెళ్లే మార్గం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భక్తులతో కిక్కిరిసింది. పుష్కరిణి వద్ద దేవస్థానం గార్డులు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తులతో సింహగిరి మెట్లమార్గం, సింహగిరిపై ఉన్న క్యూలు కిక్కిరిశాయి. ప్రసాద విక్రయశాల రద్దీగా మారింది. దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

కిక్కిరిసిన వరాహ పుష్కరిణి
1/1

కిక్కిరిసిన వరాహ పుష్కరిణి

Advertisement
 
Advertisement
 
Advertisement