బాల్యవివాహాలను నియంత్రించాలి | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలను నియంత్రించాలి

Published Wed, May 8 2024 12:45 AM

బాల్యవివాహాలను  నియంత్రించాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి భాస్కర్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో బాల్య వివాహాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు సామాజిక సమస్య అని, సమాజ చైతన్యంతోనే నిర్మూలించవచ్చన్నారు. జిల్లాలో అనుసంబంధ శాఖలన్నీ సమన్వయంతో పని చేయడం ద్వారా బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి బాల్య వివాహల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఆశ కార్యకర్తలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో తుకారాం, బాలల సంక్షేమ సమితి చైర్మన్‌ వెంకటస్వామి, డీఈవో అశోక్‌, డీపీవో సురేష్‌బాబు, బాలల సంక్షేమ సమితి సభ్యులు దశరథ్‌, సమీర్‌ ఉల్లాఖాన్‌, ఐకేపీ ఏపీడీ రామకృష్ణ, కార్మికశాఖ కమిషనర్‌ మాజర్‌ ఉన్నిసాభేగం, డీసీపీవో మహేష్‌, బాలరక్ష భవన్‌ సిబ్బంది, జిల్లా మహిళా సాధికారిత సిబ్బంది, సఖీ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement