అక్కడ సూపర్‌ హిట్‌.. తెలుగులో రిలీజ్‌ కానున్న మూవీ! | Sakshi
Sakshi News home page

Rakshit Shetty: టాలీవుడ్‌లోనూ రిలీజ్ కానున్న బ్లాక్ బస్టర్‌ సినిమా!

Published Fri, Sep 15 2023 3:20 PM

Rakshit Shetty blockbuster Sapta Sagaradaache Ello to release in Telugu - Sakshi

శాండల్‌వుడ్‌ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సప్త సాగరదాచే ఎల్లో. కన్నడలో ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో సప్త సాగరాలు దాటి అనే పేరుతో సెప్టెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ తెలుగు వెర్షన్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేస్తోంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. 

(ఇది చదవండి: రతిక.. నా కొడుకుని వాడుకుంది, అమర్‌దీప్‌ అయితే..:పల్లవి ప్రశాంత్‌ పేరెంట్స్‌)

 కన్నడలో సెప్టెంబర్ 1న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమాకు మౌత్ టాక్‌తో పాటు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కొన్ని రోజుల క్రితమే ఓ అభిమాని ట్విట్టర్‌ ద్వారా సప్త సాగరదాచే ఎల్లోని ఇతర భాషలలో కూడా విడుదల చేయాలని రక్షిత్ శెట్టిని అభ్యర్థించాడు. కాగా.. ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు భాగాలు తెరకెక్కించారు. రెండో భాగం అక్టోబర్ 20న విడుదల కానుంది.

(ఇది చదవండి: బిగ్‌బాస్‌: నాకు న్యాయం కావాలి.. చంటిపిల్లాడిలా ఏడ్చేసిన ప్రిన్స్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement