మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు | Sakshi
Sakshi News home page

మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

Published Tue, May 7 2024 10:35 AM

మహిళల

కంకిపాడు: మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకట లక్ష్మి స్పష్టం చేశారు. కంకిపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త గుమ్మడి కిరణ్‌ ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించటాన్ని మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో కమిషన్‌ చైర్‌పర్సన్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కార్యకర్త గుమ్మడి కిరణ్‌ మహిళపై దాడికి దిగటాన్ని సుమోటాగా స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, పూర్తి వివరాలను వెల్లడించాలని జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయం పేరుతో టీడీపీ కార్యకర్తలు, నేతలు మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారని, ఈ చర్యలపై ఉక్కుపాదం మోపాలని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. బాధిత మహిళ వివరాలను గోప్యంగా ఉంచి మహిళకు రక్షణ కల్పించాలని సూచించారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై గల శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ప్రతి రోజూ జరిగే నిత్యాన్నదాన పథకం నిమిత్తం విజయవాడ సెంట్రల్‌ ఎకై ్సజ్‌ కాలనీకి చెందిన అనుమంచి విజయలక్ష్మి, కుటుంబసభ్యులు రూ.1,11,116లను విరాళం ఇచ్చారు. సోమవారం ఇంద్రకీలాద్రి పైకి చేరుకున్నవారు ఆలయ అధికారులను కలిసి ఆ మొత్తానికి చెక్‌ అందజేశారు. అనంతరం దాత కుటుంబానికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు.

రెడ్డి అధికారులపై కక్షసాధింపు చంద్రబాబుకు తగదు

కృష్ణలంక(విజయవాడతూర్పు): రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై చంద్రబాబు కక్ష సాధిస్తూ వారిని విధుల నుంచి తొలగించేలా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తగదని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన చంద్రబాబు నిజాయితీపరులైన డీజీపీ రాజేంద్రనాఽథ్‌రెడ్డి, డీఐజీ అమ్మిరెడ్డి లాంటి అధికారులపై నిందలు వేసి ఎన్నికల విధులకు దూరం చేశారని తెలిపారు. గతంలో రవిశంకర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి తదితర అధికారులను కూడా బదిలీ కోరుతూ ఆరోపణలు చేశారన్నారు. కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులను మాత్రమే లక్ష్యంగా చేసి ఆరోపణలు చేయడం టీడీపీకి తగదన్నారు. రాబోయే రోజుల్లో రెడ్ల ఓట్లు తొలగించాలని కూడా ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. రెడ్డి సామాజికవర్గంపై చంద్రబాబు అవలంబిస్తున్న వ్యతిరేక ధోరణితోనే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒక్క రెడ్డి ఎమ్మెల్యే కూడా గెలుపొందలేకపోయారని పేర్కొన్నారు. టీడీపీ రెడ్ల వ్యతిరేక విధానాలపై పార్టీలోని రెడ్డి ప్రజాప్రతినిధులు చంద్రబాబును నిలదీయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ రెడ్డి సామాజిక వర్గాన్ని అణచివేసే విధానం మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

మహిళలపై వేధింపులకు  పాల్పడితే కఠిన చర్యలు
1/1

మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

Advertisement
Advertisement