ఉమ్మడి పశ్చిమగోదావరి: టీడీపీలో అసమ్మతి సెగ | Sakshi
Sakshi News home page

ఉమ్మడి పశ్చిమగోదావరి: టీడీపీలో అసమ్మతి సెగ

Published Sun, Mar 10 2024 10:09 AM

West Godavari District: Chandrababu Shock To Tdp Leaders - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ రగులుతోంది. పార్టీని నమ్ముకున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు సీటు గల్లంతయ్యింది. పోలవరం, తాడేపల్లిగూడెం సీట్లు కూడా ఇదే పరిస్థితి.. పొత్తు స్థానాల ఇన్‌ఛార్జ్‌లకు ఫోన్ చేసి సీట్లు లేవంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు.

పొత్తు స్థానాలు జనసేన ప్రకటించకుండానే చంద్రబాబు లీక్స్‌తో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పోలవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెంలో అసంతృప్తి భగ్గుమంది. డబ్బు ఖర్చుపెట్టి హడావుడి చేసిన తర్వాత పొత్తు పేరు చెప్పి సీటు గల్లంతు చేయడం సరికాదంటూ తాడేపల్లిగూడెం ఇంచార్జ్ వలవల బాబ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు.

పోలవరం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు అత్యవసర సమావేశం నిర్వహించాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొరగం శ్రీనివాస్‌కు సీటు కేటాయించాలని నాయకులు తీర్మానించారు. పోలవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉంగుటూరులో జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుకి సీటు కేటాయించాలంటూ చంద్రబాబును కలిసేందుకు భారీ ర్యాలీతో మంగళగిరి వెళ్లేందుకు ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జనసేన అభ్యర్థుల పేరుతో జిల్లాలో హడావిడిగా సర్వేలు చేపట్టగా, భీమవరం, నరసాపురం సీట్లు తేల్చకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఇదీ చదవండి: ఎచటి నుంచో ఆ పవనం!

Advertisement
Advertisement