
ఇండస్ట్రీలోకి వచ్చి చాన్నాళ్ల అవుతున్నప్పటికీ తమిళ యువ హీరోయిన్ ధన్సికకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో తన పేరుని సాయి ధన్సికగా మార్చుకుంది. త్వరలో 'ది ప్రూఫ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న ఈమె.. ఈ చిత్ర ప్రమోషన్ల భాగంగా ముద్దు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
(ఇదీ చదవండి: హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!)
'మనదోడు మళైక్కాలం' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ధన్సిక.. పలు చిత్రాల్లో నటించింది. కానీ రజినీకాంత్ 'కబాలి'లో ఆయనకు కూతురిగా చేసిన తర్వాత పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాలు చేస్తోంది గానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. దీంతో తన పేరుని ధన్సిక నుంచి సాయి ధన్సికగా మార్చుకుంది. మరి ఈసారైనా ఆమె కోరుకున్న హిట్ వస్తుందేమో చూడాలి.
ఇకపోతే తాను గ్లామర్ పాత్రల్లో నటించలేనని, ఎందుకంటే అలాంటి పాత్రలకు తాను సెట్ అవ్వనని సాయి ధన్సిక చెప్పింది. కావాలనే కొందరు దర్శకులు తనపై గ్లామర్ ముద్రని బలవంతంగా రుద్దుతారు. గ్లామర్‌గా నటించడం అనేది కథని బట్టి ఉంటుందని ధన్సిక చెప్పింది. తనకు బెడ్‌రూమ్, ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: సీరియల్ నటి పవిత్రా జయరాం కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!)
Comments
Please login to add a commentAdd a comment