మా అక్కలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడతా: వైఎస్‌ అవినాష్‌ | Sakshi
Sakshi News home page

మా అక్కలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడతా: వైఎస్‌ అవినాష్‌

Published Wed, May 8 2024 1:08 PM

YS Avinash Reddy Strong Political Counter To Sunitha And Sharmila

సాక్షి, వైఎస్సార్‌: టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. వీరితో పోరాడే శక్తిని ప్రజలే నాకు ఇస్తారని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి. ప్రతీరోజు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని పచ్చ మీడియాకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. 2021 తర్వాత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నోటికి ఎంత మాట వస్తే అంత వరకు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే కోపం కంటే ఎక్కువగా బాధేస్తోంది. వాళ్లే నన్ను టార్గెట్‌ చేస్తున్నారు.

రెండున్నరేళ్లు ఎవరూ మాట్లాడలేదు. వాచ్‌మెన్‌ రంగన్నకు నార్కో అనాలసిస్‌ టెస్ట్‌ చేసినా ఏమీ మాట్లాడలేదు. రెండున్నరేళ్ల తర్వాత రంగన్న మాట్లాడుతున్నాడు. ఓవైపు తానే చంపానని చెబుతున్న దస్తగిరి గురించి వీరద్దరూ ఏమీ అనడం లేదు. అతను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి బయట తిరుగుతున్నాడు. అన్నీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు మాటలు చెబుతున్నారు.

వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి అందరికీ అందుబాటులో ఉండి ఏ పని కావాలన్నా చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టించారు. నా తప్పు లేకపోయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా గట్టిగా నిలబడతాం. మీ అందరి మద్దతుతో గెలిచి తీరుతాను. ఇప్పుడు తిట్టిన వాళ్లే మళ్లీ క్షమాపణలు చెప్పాలి.. అది నేను వినాలి. వివేకం చిన్నాన్నను చంపిన వాస్తవం వెలుగులోకి వస్తుంది. ఈ కుట్రలు ఎవరో చేశారో తప్పకుండా బయటకు వస్తుంది.

దివంగత వైఎస్సార్‌ తాను బ్రతికినంత కాలం.. టీడీపీ, ఈనాడుతో పోరాడారు. అటువంటి వారితో ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు. మీరు వాళ్ల వారసులా.. లేక వైఎస్సార్‌ వారసులా?. నన్ను కనుమరుగు చేయాలంటే దేవుడు ఒప్పుకోడు. మా అక్కలతో పోరాడే శక్తిని ప్రజలే ఇస్తారు. వైఎస్సార్‌సీపీ ఓట్లు చీల్చి టీడీపీకి లబ్ధి చేకూర్చాలనేది షర్మిలకు కాంగ్రెస్‌ పెట్టిన టాస్క్‌. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరిది నాటకమో.. ఎవరు నిజమో ప్రజలే నిర్ణయిస్తారు అని కామెంట్స్‌ చేశారు. 

మా అక్కలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడతా: వైఎస్‌ అవినాష్‌

Advertisement
 
Advertisement
 
Advertisement