AUS Vs NZ, ODI: New Zealand Announce Squad For Australia ODIs - Sakshi
Sakshi News home page

NZ vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. జట్టును ప్రకటించిన కివీస్‌! స్టార్‌ బౌలర్‌ వచ్చేశాడు!

Published Thu, Aug 25 2022 1:37 PM

New Zealand announce squad for Australia ODIs - Sakshi

క్వీన్స్‌లాండ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న చాపెల్-హాడ్లీ ట్రోఫీ కోసం న్యూజిలాండ్ తమ జట్టును గురువారం ప్రకటించింది. గాయం కారణంగా విండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన మాట్‌ హెన్రీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా విండీస్‌తో అఖరి రెండు వన్డేలకు దూరమైన కెప్టెన్‌ విలియమ్సన్‌ కూడా తిరిగి జట్టులోకి చేరాడు.

మరోవైపు  సెంట్రల్‌ కాంట్రక్ట్‌ నుంచి తప్పుకుంటునట్లు ప్రకటించిన ట్రెంట్‌ బౌల్ట్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేయడం గమనార్హం. ఈ సిరీస్‌తో 23 ఏళ్ల బెన్‌ సియర్స్‌ న్యూజిలాండ్‌ తరపున వన్డే అరంగేట్రం చేయనున్నాడు. ఈ సిరీస్‌ కోసం ఏకంగా ఐదు మంది పేస్‌ బౌలర్లను న్యూజిలాండ్‌ ఎంపిక చేయడం విశేషం.

ఈ నేపథ్యంలో కివీస్‌ హెడ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. "టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని బెన్ సియర్స్‌ని ఈ సిరీస్‌కు ఎంపిక చేశాం. అతడు ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై అద్భుతంగా రాణించగలడన్న నమ్మకం ఉంది. ఇక హెన్రీ కూడా తిరిగి జట్టులోకి రావడం మాకు మరింత బలం చేకూరుతుంది. అతడు గత కొన్నేళ్లగా మా జట్టు ప్రధాన బౌలర్‌గా ఉన్నాడని" పేర్కొన్నాడు. ఇక చాపెల్-హాడ్లీ ట్రోఫీ సెప్టెంబర్‌ 6 నుంచి జరగనుంది.

న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ ఫిలిప్స్, మిచెల్ బెన్ సియర్స్, టిమ్ సౌథీ}
చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌! భారీ షాట్లతో విరుచుకుపడ్డ కోహ్లి.. వీడియో వైరల్‌!

 

Advertisement
 
Advertisement
 
Advertisement