ఇంకా నయం.. గ్లోవ్స్‌, బ్యాట్‌ మాత్రమే విసిరాడు! | Sakshi
Sakshi News home page

ICC CWC 2022: ఇంకా నయం.. గ్లోవ్స్‌, బ్యాట్‌ మాత్రమే విసిరాడు!

Published Sat, Apr 16 2022 5:19 PM

Scotland Batter Throws Bat-Gloves In Excitement After Winning Match - Sakshi

మ్యాచ్‌ గెలిస్తే సెలబ్రేషన్‌ చేసుకోవడం సహజం. కానీ ఒక్కోసారి అలాంటి సెలబ్రేషన్స్‌ హద్దులు దాటిపోతాయి. చూడడానికి కాస్త ఓవర్‌గా కూడా అనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌ 2022లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శుక్రవారం ఒమన్‌, స్కాట్లాండ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కష్యప్‌ 81 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ మహ్మద్‌ నదీమ్‌ 53 పరుగులు సాధించాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి విజయాన్ని అందుకుంది. రిచీ బెరింగ్‌టన్‌(73), జార్జ్‌ మున్సీ(43), మైకెల్‌ లీస్క్‌(21) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. అయితే చివర్లో రిచీ బెరింగ్‌టన్‌ ఔట్‌ కావడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. ప్రధాన బ్యాటర్స్‌ అంతా వెనుదిరగడంతో భారం అంతా మార్క్‌ వాట్‌పై పడింది. చివరి ఓవర్‌లో విజయానికి 12 పరుగులు అవసరం అయ్యాయి.

ఈ దశలో ఓవర్‌ తొలి బంతిని మార్క్‌ వాట్‌ ఫోర్‌ తరలించాడు. ఆ తర్వాత మూడు బంతులకు నాలుగు పరుగుల వచ్చాయి. ఇక ఐదో బంతిని ఫోర్‌ కొట్టి జట్టను గెలిపించాడు మార్క్‌ వాట్‌. 37 పరుగులతో అజేయంగా నిలిచిన మార్క్‌ వాట్‌ తన సహచర బ్యాటర్‌ వద్దకు పరిగెత్తుకొచ్చి గ్లోవ్స్‌, బ్యాట్‌ను గాల్లోకి విసిరేసి.. హెల్మెట్‌కు ముద్దులు పెట్టాడు. దీంతో ఇదేం వింత సెలబ్రేషన్‌ అంటూ అభిమానులు కామెంట్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: ODI World Cup Qualifiers: వన్డేల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి నమోదు

Advertisement
 
Advertisement
 
Advertisement