T20 World Cup 2021: Oman Bowler Stunning Catch Own Bowling Vs Bangladesh - Sakshi
Sakshi News home page

T20 WC 2021: ఒమన్‌ బౌలర్‌ అద్బుతం.. సింగిల్‌ హ్యాండ్‌తో

Published Wed, Oct 20 2021 4:58 PM

T20 World Cup 2021: Oman Bowler Stunning Catch Own Bowling Vs Bangladesh - Sakshi

Oman Bowler Fayyaz Butt Stunning Catch.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూఫ్‌-బి క్వాలిఫయర్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఒమన్‌ బౌలర్‌ ఫయాజ్‌ భట్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. తన బౌలింగ్‌లోనే ఒకవైపుగా డైవ్‌ చేస్తూ మెహదీ హసన్‌ను కాట్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌ మూడో బంతిని ఫయాజ్‌ భట్‌ ఫుల్‌టాస్‌​ వేయగా.. మెహదీ బ్యాట్‌ ఎడ్జ్‌ తాకి గాల్లోకి లేచింది. వెంటనే భట్‌ డైవ్‌ చేస్తూ సింగిల్‌ హ్యాండ్‌తో బంతిని అందుకొని ఆ తర్వాత రెండు చేతులతో బంతిని బాలెన్స్‌​ చేశాడు. దీంతో మెహదీ అసన్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

చదవండి: Oman Vs BAN: చెలరేగిన ముస్తాఫిజుర్‌.. 26 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ విజయం

PC: ICC T20.Com

కాగా మెహదీ అసన్‌ను డకౌట్‌ చేసిన భట్‌ మరో రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 26 పరుగుల తేడాతో ఒమన్‌పై విజయం సాధించింది. బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ బ్యాటింగ్‌లో 42 పరుగులు.. అనంతరం బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

చదవండి: T20 WC 2021: మిచెల్‌ మార్ష్‌ గోల్డెన్‌ డక్‌.. కలిసిరాని పుట్టినరోజు

 
Advertisement
 
Advertisement