రెండో రోజు 86.66 శాతం పోలింగ్‌ | Sakshi
Sakshi News home page

రెండో రోజు 86.66 శాతం పోలింగ్‌

Published Tue, May 7 2024 10:10 AM

రెండో

తిరుపతి అర్బన్‌: జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రశాంతంగా సాగింది. రెండో రోజు అయిన సోమవారం 86.66శాతం నమోదైనట్టు జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు మరో రెండు రోజులు అవకాశం ఉండడంతో వంద శాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 22,299 ఉండగా.. ఇప్పటివరకుర 19,508 ఓట్లు పోలయ్యాయని తెలిపారు.

ఓటింగ్‌ సరళి పరిశీలన

పోస్టల్‌బ్యాలెట్‌ ఓటింగ్‌ సరళిని జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పరిశీలించారు. సోమవారం ఆయన తిరుపతి,చంద్రగిరి, శ్రీకాళహ స్తి, సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయా నియోజకవర్గాల్లో ఈవీఎంలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

మరో అవకాశం

సార్వత్రిక ఎన్నికల డ్యూటీలోని ఉద్యోగులకు మే1వ తేదీలోపు ఫారం–12ను సమర్పించలేకపోయిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేయడానికి మంగళ, బుధవారాలు అవకాశం కల్పించినట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికి కేటాయించిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో తమ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రెండో రోజు  86.66 శాతం పోలింగ్‌
1/1

రెండో రోజు 86.66 శాతం పోలింగ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement